ETV Bharat / international

పాక్ వక్రబుద్ధి- మళ్లీ కశ్మీర్ అంశంలో జోక్యం - కశ్మీర్ అంశంపై పాకిస్థాన్​ నివేదిక

కశ్మీర్​లో భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూ 131పేజీలతో కూడిన డాక్యుమెంట్​ను విడుదల చేసింది పాకిస్థాన్​. ఈ క్రమంలో భారత ప్రభుత్వంపై అనేక నిందలు వేసింది. కశ్మీర్​ అంశం మా దేశ అంతర్గత వ్వవహారమని భారత్​ ఎన్ని సార్లు చెప్పినా.. పాక్​ తన వక్ర బుద్ధిని మార్చుకోవడం లేదు.

Pak Rumer's on India
భారత్​పై పాక్​ అక్కసు
author img

By

Published : Sep 12, 2021, 7:41 PM IST

Updated : Sep 12, 2021, 7:54 PM IST

పాకిస్థాన్​ మరోమారు తన వక్రబుద్ధిని బయటపెట్టింది. కశ్మీర్​ అంశంపై మళ్లీ జోక్యం చేసుకుంది. ఈసారి ఏకంగా భారత ప్రభుత్వంపై విషం కక్కింది. కశ్మీర్​లో భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ.. పలు పత్రాలను విడుదల చేసింది.

ఇస్లామాబాద్​లో జరిగిన మీడియా కాన్ఫరెన్స్​లో 131పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్​ను విడుదల చేశారు పాక్​ విదేశాంగ మంత్రి మహమ్మద్​ ఖురేషీ, జాతీయ భద్రతా సలహాదారు యూసఫ్​. భారత నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు నిర్ణయించుకున్నట్టు ఖురేషీ ఈ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

"ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్​ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ భారత ప్రభుత్వం నిజస్వరూపాన్ని బయటపెట్టాలని మేము నిర్ణయించుకున్నాము. అందుకే కశ్మీర్​పై ఈ పత్రాలను రూపొందించాము. 26అంతర్జాతీయ, 14 పాకిస్థాన్​ మీడియా రిపోర్టుల నుంచి సేకరించిన 113 ఘటనలను ఇందులో పొందుపరిచాము. కశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్టు ఇవి స్పష్టం చేస్తాయి. ఐరాసతో పాటు అంతర్జాతీయ సమాజానికి ఈ పత్రాలను పంపిస్తాము."

- మహమ్మద్​ ఖురేషీ, పాక్​ విదేశాంగమంత్రి

కశ్మీర్​ తమ దేశ అంతర్గత వ్యవహారమని భారత్​ ఎన్నిసార్లు చెప్పినా.. పాకిస్థాన్​ జోక్యం చేసుకుంటూనే ఉంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ముగింపు పలికి.. వాస్తవాలను అర్థం చేసుకోవాలని అనేకమార్లు హితవు పలికినా.. పాక్​ పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా.. కశ్మీర్​ ప్రజలపై భారత్​ రసాయన ఆయుధాలను ప్రయోగిస్తోందని తాజాగా ఆరోపించింది.

కశ్మీర్​ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్టు 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పటి నుంచి భారత్​కు వ్యతిరేకంగా పాక్​ ఆరోపణలు చేస్తూనే ఉంది.

ఇదీ చదవండి: Taliban Government: తాలిబన్ల ప్రభుత్వం కూర్పులో పాకిస్థాన్ హస్తం!

Last Updated : Sep 12, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.