ETV Bharat / international

కరోనా నుంచి కోలుకున్న పాక్​ ప్రధాని - పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ కరోనా నుంచి కోలుకున్నారు. ఆ దేశ రాష్ట్రపతి డా. ఆరిఫ్ ఆల్వీ, రక్షణ మంత్రి ఖట్టక్​కు వైరస్​ సోకింది.

pakistan pm recovers from corona, పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
author img

By

Published : Mar 30, 2021, 9:09 PM IST

ఇటీవల కరోనా బారిన పడ్డ పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని చట్టసభ్యుడు ఫైజల్ జావేద్​ ఖాన్​ మంగళవారం వెల్లడించారు. ప్రధాని పూర్తిగా కోలుకున్నారని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

"ప్రధాని పూర్తిగా కోలుకున్నారు. వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటిస్తూ కార్యకలాపాల నిర్వహణకు ఉపక్రమించారు."

-ఫైజల్ జావేద్​ ఖాన్​, పాకిస్థాన్​ చట్టసభ్యుడు

మార్చి 20న పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​, ఆయన సతీమణి బుశ్రా బీబీకి కరోనా సోకింది.

రాష్ట్రపతికి కరోనా..

పాకిస్థాన్​ రాష్ట్రపతి డా. ఆరిఫ్ ఆల్వీ సహా పలువురు కీలక నేతలకు కరోనా సోకింది. రాష్ట్రపతికి కరోనా సోకినట్లు సోమవారం వెల్లడైంది. తనకు కొవిడ్​ సోకినట్లు ఆల్వీ ట్వీట్​ చేశారు.

"నాకు కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఇటీవల టీకా​ తొలి డోసు తీసుకున్నాను. కానీ రెండో డోసు తీసుకున్నాకే యాంటిబాడీలు ఏర్పడతాయి. ఈ వారంలో రెండో డోసు తీసుకోవాల్సి ఉంది."

-డా. ఆరిఫ్ ఆల్వీ, పాకిస్థాన్​ రాష్ట్రపతి

రక్షణ మంత్రి ఖట్టక్​కు కూడా కరోనా సోకింది. ఖట్టక్​కు కరోనా సోకడం ఇది రెండోసారి. గతేడాది మహమ్మారి​ బారిన పడిన కొద్దిరోజులకు ఆయన కోలుకున్నారు.

ఇదీ చదవండి : కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.