ETV Bharat / international

పాక్​పై భిన్నాభిప్రాయాలు- 'గ్రే' లిస్ట్​లోనే కొనసాగింపు!

author img

By

Published : Feb 22, 2021, 2:44 PM IST

ఉగ్ర కార్యకలాపాల విషయంలో పాకిస్థాన్.. జూన్ ​వరకు ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ఫోర్స్ 'గ్రే' జాబితా​లోనే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఆ దేశం గురించి అధికారులు, రాయబారులు చర్చించగా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు పాక్ పత్రిక వెల్లడించింది.

Pakistan likely to remain in grey list as FATF meet begins
పాక్​పై భిన్నాభిప్రాయాలు- 'గ్రే' లిస్ట్​లోనే కొనసాగింపు!

ఉగ్రవాద కార్యకలాపాలకు వంతపాడుతున్న పాకిస్థాన్.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్​ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే జాబితాలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. పాక్​ గురించి చర్చించిన అధికారులు, విదేశీ రాయబారులు.. గ్రే లిస్ట్ నుంచి తప్పించే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని డాన్ పత్రిక వెల్లడించింది. సానుకూల ఫలితం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని కొందరు అధికారులు అభిప్రాయపడగా.. కొందరు దౌత్యవేత్తలు మాత్రం కనీసం జూన్​ వరకు పాక్​ను గ్రే లిస్ట్​లోనే ఉంచాలని స్పష్టం చేసినట్లు పేర్కొంది.

ప్లీనరీలో పాక్​ను గ్రే లిస్ట్​లోనే ఉంచడం, అందులో నుంచి తొలగించడం సహా ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించనున్నట్లు తెలిపింది డాన్. ఎఫ్ఏటీఎఫ్ నివేదిక ఆధారంగా చర్చలు ఉంటాయని వెల్లడించింది. ఈ నివేదికలో పాక్​కు ప్రతికూలంగా ఉన్న అంశాలపై స్నేహపూర్వక దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉందని, కాబట్టి చర్చ మరింత సుదీర్ఘంగా సాగుతుందని పేర్కొంది.

జూన్ తర్వాత బయటపడేనా!

ఈ చర్చల తర్వాత కూడా తుది నిర్ణయం తీసుకోకపోవచ్చని డాన్ పేర్కొంది. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎఫ్​ఏటీఎఫ్​ కమిటీ పరిశీలించే అవకాశం ఉందని తెలిపింది. పాక్ ఎఫ్ఏటీఎఫ్ నివేదిక సరైనదేనని తేల్చుకున్న రెండు నెలల తర్వాత మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని, అనంతరం గ్రే లిస్ట్​ నుంచి అధికారికంగా బయటపడే అవకాశం ఉందని వివరించింది.

ప్లీనరీ సమావేశానికి ముందు అన్ని దేశాల ప్రదర్శనను మదింపు వేసింది ఎఫ్​ఏటీఎఫ్. దీని ప్రకారం ఎఫ్ఏటీఎఫ్ సిఫార్సు చేసిన 40 అంశాల్లో కేవలం రెండింటిలోనే పాక్ మెరుగైన పనితీరు కనబర్చింది. 25 అంశాల్లో పాక్షిక పనితీరు కనబర్చింది. నాలుగు అంశాలను పూర్తిగా విస్మరించింది.

ఇదీ చదవండి: జూన్​ వరకు ఎఫ్​ఏటీఎఫ్​​ గ్రే లిస్టులోనే పాకిస్థాన్!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.