ETV Bharat / international

పాక్​ విమాన ప్రమాదంలో అంతుచిక్కని అనుమానాలెన్నో!

పాకిస్థాన్​లో శుక్రవారం జరిగిన ఘోర విమాన ప్రమాద మిస్టరీ ఇంకా వీడలేదు. ఎయిర్​బస్​ ఏ-320 ఫిట్​గా ఉన్నట్లు ఘటన అనంతరం పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ లైన్స్‌ ప్రకటించింది. అయితే దానికి రెండు నెలలుగా ఫిట్​నెస్​ తనిఖీలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ల్యాండింగ్​ అయ్యే సమయంలో ఇంజిన్​ నుంచి మంటలు రావడం చూశామని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.

PIA crashed plane last checked 2 months ago, returned from Muscat day before
పాకిస్థాన్​ విమాన ప్రమాదంలో అంతుచిక్కని అనుమానాలెన్నో!
author img

By

Published : May 23, 2020, 6:31 PM IST

Updated : May 24, 2020, 5:45 PM IST

పాక్​లోని కరాచీ విమానాశ్రయంలో నిమిషం వ్యవధిలో ల్యాండ్​ అవ్వాల్సిన లోహవిహంగం ఎయిర్​బస్​ ఏ-320 అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 97 మంది మరణించారు. ఇందులో 9 మంది చిన్నారులు ఉన్నారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదం అనంతరం స్పందించిన పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ లైన్స్‌ (పీఐఏ) అధికారులు విమానం పూర్తి కండిషన్​లోనే ఉన్నట్లు వెల్లడించారని అక్కడి అధికారిక మీడియా డాన్​ పేర్కొంది.

Pakistan International Airlines flight crash
విమానం కూలీన ప్రదేశం

రెండు నెలలుగా చెకింగ్​ లేదు..!

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్​డౌన్​ కారణంగా విమాన సేవలు నిలిచిపోయాయి. అయితే ఈ సమయంలో ఆగిపోయిన విమానం.. తాజాగా సర్వీసులు ప్రారంభించినా ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విమాన పనితీరును రెండు నెలలుగా పరీక్షించలేదని.. ప్రమాదం జరిగిన ముందురోజే అత్యవసరంగా మస్కట్​ నుంచి లాహోర్​కు దీన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

అన్నీ బాగానే ఉన్నాయి: పీఐఏ

ప్రమాదంపై ప్రాథమిక నివేదిక విడుదల చేసిన పీఐఏ... విమానంలో సాంకేతిక సమస్యలు లేవని స్పష్టం చేసింది. ఇంజిన్​, గేర్​, ఎయిర్​సిస్టమ్​ పనితీరు బాగానే ఉన్నట్లు వెల్లడించింది. మార్చి 21న చివరగా విమానాన్ని పరీక్షించారని పేర్కొంది. పైలట్ల వైద్య నివేదికలు బట్టి ప్రయాణానికి ముందు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని పీఐఏ తెలిపింది.

ఈ ఏడాది నవంబర్​ 5 వరకు విమానానికి ఎలాంటి ఇబ్బందులు లేవని ఆ దేశ పౌర విమానయాన శాఖ సర్టిఫికెట్​ ఇవ్వడాన్ని ప్రస్తావించింది. కూలిపోయిన ఈ ఎయిర్​బస్​కు 2014, నవంబర్​ 6 నుంచి 2015, నవంబర్​ 5 వరకు తొలిసారి అనుమతి ఇచ్చారని... విమానం ప్రతి ఏడాది పూర్తిగా చెక్​ చేశాకే సంవత్సర కాలానికి అనుమతి ఇస్తారని పీఐఏ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

స్వతంత్ర విచారణ కోసం...

ఈ ఘటనపై విచారణ బాధ్యతలను ఎయిర్​క్రాఫ్ట్​ యాక్సిడెంట్​ అండ్​ ఇన్వెస్టిగేషన్​ బోర్డు ప్రెసిడెంట్​(​పీఏఏఐబీ)మహ్మద్​ ఉస్మాన్​ ఘనీకి అప్పజెప్పింది ప్రభుత్వం. నెలరోజుల్లో ప్రాథమిక విచారణకు సంబంధించిన నివేదిక అందించాలని సూచించింది. అయితే అంతర్జాతీయ సంస్థలతో వేగంగా విచారణ జరిపించాలని కోరింది పాకిస్థాన్​ ఎయిర్​లైన్స్​ పైలట్స్​ అసోసియేషన్​(పీఏఎల్​పీఏ). ఈ విచారణలో గ్రౌండ్​, విమాన సిబ్బందినీ ఆరా తీయాలని సూచించింది.

ప్రత్యక్ష సాక్షుల మాట ఇలా...

విమానాన్ని ల్యాండ్​ చేసేందుకు పైలట్లు 2 సార్లు ప్రయత్నించినా విఫలమైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని డాన్​ పత్రిక పేర్కొంది. ల్యాండింగ్​ సమయంలో చక్రాలు బయటకు రాలేదని అప్పుడు విమానం అడుగుభాగం భవనాలకు తాకినట్లు అందులో రాసుకొచ్చింది. ఇంజిన్​ నుంచి మంటలు రావడం గమనించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారని తెలిపింది.

ల్యాండింగ్​లో ఇబ్బందులు!

విమాన చక్రాల వ్యవస్థ (ల్యాండింగ్‌ గేర్‌)కు సంబంధించి సమస్యలు ఉన్నట్లు పీకే-8303 పైలట్‌ కెప్టెన్‌ సజ్జాద్‌ గుల్‌ మధ్యాహ్నం 2.37 గంటలకు విమాన రద్దీ నియంత్రణ వ్యవస్థ (ఏటీసీ)కు తెలిపినట్లు పీఐఏ అధికారి ఒకరు చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ లోహ విహంగం.. రాడార్‌ తెరపై నుంచి అదృశ్యమైందన్నారు.

మరోవైపు పైలట్‌కు కరాచీ ఏటీసీకి మధ్య జరిగిన చిట్టచివరి సంభాషణను సంపాదించినట్లు పాక్‌ వార్తా ఛానల్‌ ఒకటి పేర్కొంది. దీని ప్రకారం.. విమానంలోని రెండు ఇంజిన్లు విఫలమైనట్లు పైలట్‌ తెలిపారు. ఆ తర్వాత కొద్ది సెకన్లకు పైలట్‌ 'మేడే.. మేడే.. మేడే..'(ప్రమాద సంకేతం) అని అరిచారు. అనంతరం విమానం నుంచి ఎలాంటి సంకేతాలు లేవు.

మృతదేహాలకు డీఎన్​ఏ పరీక్షలు

విమానం జిన్నా హౌసింగ్‌ సొసైటీపై కూలి పోయింది. ఈ ఘటనలో గుర్తుపట్టలేనంతగా ఉన్న మృతదేహాలకు డీఎన్​ఏ టెస్టులు నిర్వహిస్తోన్నట్లు పాక్​ అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో 11 మంది సాధారణ ప్రజలు చనిపోయారని దాదాపు 25-30 మంది గాయపడినట్లు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు ఐదుగురి శవాలు మాత్రమే లభ్యమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఎక్కువ మృతదేహాలు కాలిపోయి ముద్ద అయిపోవడం వల్ల గుర్తుపట్టలేకపోతున్నామని.. వాటికి డీఎన్​ఏ టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు సంబంధించిన బంధువులు కరాచీ యూనివర్సిటీ ఫోరెన్సిక్​ డీఎన్​ఏ లాబోరేటరీలో తగిన వివరాలు ఇచ్చి మృతదేహాలను గుర్తించవచ్చని సూచించారు.

Last Updated : May 24, 2020, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.