ETV Bharat / international

చైనాను కట్​ చేయకపోతే ఇక పాక్​ పని అంతే! - చైనా కరోనా వైరస్​

కరోనా వైరస్​, భారత్​తో సరిహద్దు వివాదంపై చైనా తీరును ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి. అయితే ఈ పరిణామాలు చైనా మిత్ర దేశమైన పాకిస్థాన్​పైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. చైనాపై తమ విధానాలను పునఃసమీక్షించాలని ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. లేకపోతే ప్రపంచంలో ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి పలు అభివృద్ధి చెందిన దేశాలు.

Pakistan government under pressure to review China Policy
చైనాను కట్​ చేయకపోతే.. ఇక పాక్​ పని అంతే!
author img

By

Published : Jul 4, 2020, 4:35 PM IST

చైనా-పాకిస్థాన్​... ఈ రెండు దేశాల మధ్య విడదీయలేని బంధం ఉంది. ప్రపంచ వేదికల్లో ఈ విషయాన్ని ఇరు దేశాలు అనేకమార్లు రుజువు చేశాయి. అయితే ఇప్పటికే ఆర్థిక సమస్యలతో బలహీనపడ్డ పాక్​కు ఇదే పెద్ద ప్రమాదంగా మారినట్టు కనిపిస్తోంది. చైనాతో సంబంధాలను పునః​సమీక్షించుకోవాలని ప్రపంచ దేశాలు పాక్​పై ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. భారత్​తో సరిహద్దు వివాదం, కరోనా వైరస్​పై చైనా ప్రదర్శించిన తీరు నేపథ్యంలో పాక్​ను హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది.

భారత్​తో వివాదం...

ఇన్నేళ్లు చైనా ఏం చేసినా.. వాటికి వత్తాసు పలుకుతూ వచ్చింది పాక్​. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా సంక్షోభానికి చైనా కారణమని ఇప్పటికే అనేక మంది అగ్రనేతలు ఆరోపించారు. ఇప్పుడు భారత్​పై చైనా దుస్సాహసానికి తెగబడటం.. ప్రపంచ దేశాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఆ దేశంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో చైనాను ఏకాకి చేయాలని నిర్ణయించుకున్నాయి పలు ఆర్థిక శక్తులు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్​పై ఒత్తిడి పెంచినట్టు సమాచారం. చైనాతో తన సంబంధాలపై ఓ స్పష్టతకు రావాలని.. లేకపోతే చైనా లాగే పాక్​ కూడా ఏకాకిగా మిగిలిపోతుందని తేల్చిచెబుతున్నాయి.

పాకిస్థాన్​కు ఇప్పటికే ఈ సంకేతాలు కనపడుతున్నాయి. పాక్​కు చెందిన పీఐఏ విమానాలను ఐరోపాలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐరోపా సమాఖ్య (ఈయూ). ఈ విషయంపై పాక్​ చేసిన అభ్యర్థలను తోసిపుచ్చింది ఈయూ. భారత్​పై చైనా చేసిన దుస్సాహసానికి ఆగ్రహంతో ఉన్న ఈయూ.. దౌత్యస్థాయిలో ఆ దేశాన్ని ఏకాకిని చేయాలని చూస్తోంది. ఈ పరిణామాలతో తమపై తీవ్ర ప్రభావం పడుతుందని పాక్​ వర్గాలు ఇప్పటికే భావిస్తున్నాయి.

పాక్​లోనూ...

అయితే పాకిస్థాన్​ ప్రజలే చైనాపై తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బలూచిస్థాన్​, గిల్గిట్​ బాల్టిస్థాన్​ వ్యాప్తంగా చైనాపై ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి. ఇందుకు ముఖ్య కారణం సీపెక్ ​(చైనా-పాక్​ ఎకనామిక్​​ కారిడర్​). సీపెక్​ పేరుతో పాకిస్థాన్​ వనరులను చైనా దోచుకుంటోందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. సీపెక్​ ద్వారా ఉద్యోగాలు లభిస్తాయనుకుంటే .. అది కూడా జరగడం లేదని, తమ సొంత కార్మికులనే చైనా తెచ్చుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ పేరుతో తమ సంప్రదాయలు, ఆచారాలను కూడా చైనా లెక్కచేయడం లేదంటున్నారు.

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని వారు నమ్ముతున్నారు. త్వరలో పాకిస్థాన్​కు కూడా ఇదే గతి పడుతుందన్న వదంతులు గిల్గిట్​-బాల్టిస్థాన్​ వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ విషయంపై స్థానిక ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.