పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇస్లామిక్ వర్గాలు ఒత్తిడి చేయడం వల్ల ఆరు నెలలుగా నిలిచిపోయిన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించవచ్చంటూ రాజధాని అభివృద్ధి అధికార యంత్రాంగం అనుమతులు జారీ చేసింది.
20వేల చదరపు అడుగుల స్థలంలో శ్రీకృష్ణుడి దేవాలయాన్ని నిర్మించేందుకు హిందూ పంచాయత్‌కు 2017లోనే అనుమతి లభించినప్పటికీ పలు కారణాలు వల్ల నిర్మాణ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది. దేవాలయంతో పాటు పక్కనే ఉన్న హిందూ శ్మశానవాటికకు ప్రహరీ నిర్మాణానికి కూడా తాజాగా అనుమతించింది. అధికారిక గణాంకాల ప్రకారం సుమారు 75 లక్షల మంది హందువులు పాకిస్థాన్‌లో నివాసముంటున్నారు.
ఇదీ చూడండి: కరోనా టీకా తీసుకున్న జో బైడెన్