జమ్ముకశ్మీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి. కశ్మీర్లో తాజా ఆంక్షలపై జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జమ్ముకశ్మీర్‌ను 'భారతీయ రాష్ట్రాం'గా పేర్కొన్నారు. ఖురేషీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కశ్మీర్ భారత్‌లో భాగమేనన్న సత్యాన్ని పాకిస్థాన్ ఎట్టకేలకు ఒప్పుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
"కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని భారత్ ప్రపంచ దేశాలకు చెబుతోంది. ఒకవేళ అదే నిజమైతే... భారతీయ రాష్ట్రమైన జమ్ముకశ్మీర్‌కు వెళ్లేందుకు అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, మీడియాను ఎందుకు అనుమతించట్లేదు? భారత్ అసత్యాలు చెబుతోంది. ఒక్కసారి కశ్మీర్లో ఆంక్షలు ఎత్తివేస్తే నిజమేంటో బయటకు వస్తుంది. అప్పుడే ప్రపంచం మేలుకుంటుంది."
- షా మహ్మద్ ఖురేషీ, పాక్ విదేశాంగ మంత్రి