ETV Bharat / international

కరోనా నిధికి చేతులెత్తేసిన పాక్

కరోనాపై పోరాడేందుకు ఇటీవల సార్క్​ దేశాలకు అత్యవసర నిధి ఏర్పాటుకు మోదీ పిలుపునిచ్చారు. అయితే ఈ ప్రతిపాదనకు పాక్​ మొండి చేయి చూపింది. సార్క్​ దేశాలు ఈ నిధికి సాయం అందిస్తుంటే.. పాక్ మాత్రం ఎలాంటి నిధులు అందించలేదు.​

Pakistan distances Narendra Modi's Emergency Fund for SAARC countries to fight Corona
కరోనా నిధికి చేతులెత్తేసిన పాక్
author img

By

Published : Mar 23, 2020, 8:37 PM IST

పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్ధిని చూపెట్టింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన కరోనా అత్యవసర నిధి ఏర్పాటుకు మొండి చేయి చూపించింది. ఇటీవల మోదీ పిలుపు మేరకు ఏర్పాటు చేసిన సార్క్‌ దేశాల సమావేశానికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దూరంగా ఉన్నారు. తాజాగా అత్యవసర నిధికీ ఎలాంటి సాయం చేయలేదు. అయితే కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్రమంలో తానిచ్చిన పిలుపును స్వాగతించి సహకరించిన సార్క్‌ దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల ఏర్పాటు చేసిన సార్క్‌ సమావేశంలో కరోనాపై ఏ ఒక్కరం ఒంటరిగా విజయం సాధించలేమని మోదీ ఉద్ఘాటించారు. అందరం కలిస్తేనే విజయం సాధ్యమని ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కొవిడ్‌19 అత్యవసర నిధిని ప్రతిపాదించారు. 10మిలియన్‌ డాలర్ల నిధి ఏర్పాటు చేసి దాన్ని కరోనాపై పోరాడేందుకు వినియోగిద్దామని మోదీ సార్క్‌ దేశాలను కోరారు.

ఆ దేశం కూడా దూరంగానే...

ఈ ప్రతిపాదనకు సమ్మతించిన సార్క్‌ సభ్య దేశాలు బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌, నేపాల్‌ తమ వంతు నిధిని ప్రకటించాయి. బంగ్లాదేశ్‌ 1.5మిలియన్‌ డాలర్లు, అఫ్గానిస్థాన్‌ ఒక మిలియన్‌ డాలర్లు ప్రకటించగా మాల్దీవులు 2లక్షల డాలర్లు ఇస్తున్నట్లు పేర్కొంది. శ్రీలంక మరో అడుగు ముందుకేసి 5మిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. భూటాన్‌ కూడా నిధి ఏర్పాటుకు దూరంగా ఉండటం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.