ETV Bharat / international

PakVac: చైనా సాయంతో పాక్ స్వదేశీ టీకా - pak corona vaccine

కరోనా కట్టడికి పాకిస్థాన్ స్వదేశీ టీకాను(PakVac) విడుదల చేసింది. తమ చిరకాల మిత్ర దేశం చైనా సాయంతో ఈ కొవిడ్ వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. త్వరలో ఉత్పత్తిని వేగవంతం చేయనున్నట్లు తెలిపింది.

COVID-19 vaccine 'PakVac
PakVac: చైనా సాయంతో పాక్ స్వదేశీ కరోనా టీకా
author img

By

Published : Jun 2, 2021, 1:33 PM IST

చిరకాల మిత్ర దేశం చైనా సాయంతో కరోనా కట్టడికి స్వదేశీ టీకాను(PakVac) అభివృద్ధి చేసినట్లు పాకిస్థాన్​ తెలిపింది. మంగళవారం దీన్ని ఇస్లామాబాద్​లో విడుదల చేసింది.

తాము ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లను మిత్ర దేశాల సహకారంతో అధిగమించడమేగాక, వీటిని అవకాశాలుగా మల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాకిస్థాన్​ ఆరోగ్య శాఖ ప్రత్యేక సహాయాధికారి డా.పైజల్​ సుల్తాన్ తెలిపారు.

PakVac తయరీకి అవసరమైన ముడి పదార్థాలను చైనా సమకూర్చిందని, అయినా దీన్ని అభివృద్ధి చేయడం అంత సలభం కాదని డా.పైజల్ చెప్పారు. చైనా తమకు అత్యంత సన్నిహిత భాగస్వామ్య దేశమని తెలిపారు. త్వరలో ఈ టీకా ఉత్పత్తిని భారీ స్థాయిలో ప్రారంభిస్తామన్నారు.

పాకిస్థాన్​లో కరోనా ఉద్ధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. పాజిటివిటీ రేటు 4 శాతం దిగువకు పడిపోయింది. కొత్త కేసుల సంఖ్య (1,771) మూడు నెలల కనిష్ఠానికి తగ్గింది. ఆ దేశంలో ఇప్పటివరకు 9,22,824 మందికి వైరస్ సోకింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొత్తం 73లక్షల టీకా డోసులను పంపిణీ చేశారు. దాదాపు 20 లక్షల మందికి వ్యాక్సినేషన్​ పూర్తయింది.

ఇదీ చూడండి: మరో చైనా టీకాకు పాక్​ అత్యవసర అనుమతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.