ETV Bharat / international

'కశ్మీర్​లో ఆ దేశాల వారిని అనుమతించాలి' - పాక్​ విదేశీ వ్యవహారాల శాఖ

జమ్ముకశ్మీర్​ విషయంలో తటస్థంగా ఉండే అంతర్జాతీయ ప్రతినిధులను మాత్రమే కశ్మీర్​లోని పరిస్థితిని అంచనా వేసేందుకు అనుమతించాలని భారత్​కు పాక్ సూచించింది. ఈయూ, ఐఓసీ దేశాల రాయబారుల బృందం గురువారం కశ్మీర్​లో పర్యటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

Pak urges India to let neutral international observers visit Kashmir
'కశ్మీర్​కు తటస్థ దేశాల ప్రతినిధులను అనమతించండి'
author img

By

Published : Feb 19, 2021, 9:32 AM IST

జమ్ముకశ్మీర్​ విషయంలో తటస్థంగా ఉండే దేశాల ప్రతినిధులను అక్కడికి అనుమతించాలని పాకిస్థాన్​​ విదేశాంగ ప్రతినిధి జహీద్​ హఫీజ్​ చౌదరీ తెలిపారు. కశ్మీర్​లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో అంచనా వేసి, కశ్మీర్ ప్రజలతో మాట్లాడేందుకు ఐరాస​కు చెందిన పరిశీలకులు, మానవ హక్కుల సంఘానికి చెందిన అధికారులు, అంతర్జాతీయ మీడియా సంస్థలను కశ్మీర్​లోకి అనుమతించాలన్నారు.

ఈయూ, ఐఓసీ దేశాల రాయబారుల బృందం గురువారం కశ్మీర్​లో పర్యటించిన అనంతరం హఫీజ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

హఫీజ్​ వ్యాఖ్యలపై భారత్​ మండిపడింది. కశ్మీర్, లద్దాఖ్​లు భారత అంతర్భాగంలోనివని.. వీటిపై వ్యాఖ్యలు చేసేందుకు పాక్​కు హక్కులేదని తేల్చి చెప్పింది. అయితే.. పాక్​తో భారత్​ సాధారణ సంబంధాలను కోరుకుంటోందని అంతకు ముందు భారత్​ విదేశీ వ్యవహారాల ప్రతినిధి అనురాగ్ శ్రీ వాస్తవ తెలిపారు.

సిక్కు యాత్రికులు..

సిక్కు యాత్రికులు పాక్​ వెళ్లకుండా భారత్ నిషేధించడంపై హఫీజ్​ స్పందించారు. భారత్ ​నుంచి తమ దేశానికి వచ్చే యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. వారి ప్రయాణం కోసం భారత్​ కూడా సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భద్రత, కొవిడ్​-19 దృష్ట్యా దాదాపు 600 మంది సిక్కు ప్రయాణికులను పాకిస్థాన్​ వెళ్లేందుకు భారత్ అనుమతి నిరాకరించింది.

ఇదీ చదవండి : 'క్వాడ్​' మంత్రుల భేటీలో చైనాపైనే ప్రధాన చర్చ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.