ETV Bharat / international

కరోనాపై పోరులో భారత్​ బాటలోనే పాక్​ - కరోనా కేసులు వెయ్యికుపైగా, మరణాల సంఖ్య ఏడుకు చేరడం వల్ల జాగ్రత్ర చర్యలు మరింత వేగవంతం చేసింది ఆ దేశ

పాకిస్థాన్​లో కరోనా కేసులు వెయ్యి దాటి, మరణాల సంఖ్య ఏడుకు చేరిన నేపథ్యంలో జాగ్రత్త చర్యలు మరింత వేగవంతం చేసింది ఆ దేశ ప్రభుత్వం. దేశీయ విమానాల సేవలను మార్చి 26 నుంచి ఏప్రిల్​ 2వ తేదీ వరకు రద్దు చేసింది.

Pak suspends domestic flights as coronavirus cases cross 1,000
కరోనా ఎఫెక్ట్​ : పాక్​ దేశీయవిమానాల సేవలు రద్దు
author img

By

Published : Mar 25, 2020, 7:02 PM IST

పాకిస్థాన్​లోనూ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది పాకిస్థాన్. దేశీయ విమానాల సేవలను మార్చి 26 నుంచి ఏప్రిల్​ 2వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే అంతర్జాతీయ విమానాల సేవలను నిలిపివేసింది ఆ దేశ ప్రభుత్వం. సరుకు రవాణా విమానాలకు మినహాయింపు ఇచ్చింది.

సింధ్​లోనే అధికం...

ఇప్పటి వరకు పాకిస్థాన్​లో మొత్తం 1,037(సింధ్-413, బలూచిస్థాన్​-115, పంజాబ్​-296, కేపీ-117, గిల్గిట్​-బాలిస్టాన్​-80, ఇస్లామాబాద్-​15, పాక్​ ఆక్రమిత కశ్మీర్​-1) కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం ఏడుగురు మృతి చెందారు. 18 మంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది.

కరోనాపై పోరుకు ఆర్థిక ప్యాకేజీ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాక్​ ఇప్పటికే అక్కడ లాక్​డౌన్​ విధించింది. వైరస్​పై పోరుకు, ఆ దేశ పేద ప్రజల సౌకర్యార్థం కోసం ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్​ 200 బిలయన్ రూపాయల​ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.

ఇదీ చూడండి : కరోనా పంజా​: కొరియా సాయం కోరిన ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.