భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు రాయబార అనుమతి కల్పించేందుకు పాకిస్థాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దౌత్యసాయం అందించేందుకు నేడు అవకాశం కల్పిస్తామని పాక్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలు, రాయబార సంబంధాలపై వియన్నా ఒప్పందం ప్రకారం.. కుల్‌భూషణ్‌కు కాన్సులర్ అనుమతి జారీ చేశామని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది.
తక్షణ రాయబార అనుమతి కల్పించాలన్న ఐసీజే తీర్పు మేరకు గతంలో భారత అధికారులు జాదవ్‌తో సమావేశం అవ్వాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో అది కార్యరూపం దాల్చలేదు. అనంతరం ఆరు వారాల తర్వాత జాదవ్‌కు రాయబార అనుమతి కల్పించనుంది పాకిస్థాన్.
గూఢచర్యం ఆరోపణలతో 2017లో కుల్‌భూషణ్‌ను అరెస్టు చేసింది పాక్ సైన్యం. మరణ శిక్షనూ విధించింది. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇదీ చూడండి: మాల్దీవులు వేదికగా భారత్-పాక్ మాటలయుద్ధం