పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్‌కు విచిత్ర ఘటన ఎదురయింది. ఇస్లామాబాద్‌లో నిర్వహిస్తున్న కశ్మీర్ అవర్ సభలో మాట్లాడుతున్న సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యారు అహ్మద్.
-
Pak Railway Minister faces electric shock as soon as he takes Modi’s name.. just initial signs of what’s in the store..😂 pic.twitter.com/UQCBmb3Thh
— Deepak Tekwani (@dtekwani) August 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pak Railway Minister faces electric shock as soon as he takes Modi’s name.. just initial signs of what’s in the store..😂 pic.twitter.com/UQCBmb3Thh
— Deepak Tekwani (@dtekwani) August 30, 2019Pak Railway Minister faces electric shock as soon as he takes Modi’s name.. just initial signs of what’s in the store..😂 pic.twitter.com/UQCBmb3Thh
— Deepak Tekwani (@dtekwani) August 30, 2019
కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఉద్దేశాలేమిటో మాకు తెలుసంటూ వ్యాఖ్యానిస్తుండగా ఆయన విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. షాక్ కొట్టిన క్షణంలో ఆయన ఒక్కసారిగా వేదికపై తుళ్లిపడ్డారు. అనంతరం ఈ సమావేశాన్ని మోదీ విఫలం చేయలేరంటూ రషీద్ వ్యాఖ్యానించారు.
కశ్మీర్ వ్యవహారంలో రషీద్ ఇటీవల అనవసరంగా నోరు పారేసుకున్నారు. కశ్మీర్ అంశంపై పోరాటానికి నిర్ణయాత్మక సమయం వచ్చేసిందన్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతుందంటూ రావల్పిండిలో జోస్యం చెప్పారు. రెండు దేశాల మధ్య ఇది చివరి యుద్ధం కానుందని నోటి దురుసు ప్రదర్శించారు.
ఇదీ చూడండి: కశ్మీర్ అంశంపై పాక్ రగడ-అరగంట పాటు ఆందోళన