పార్లమెంటులో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించారు. బుధవారం జరిగిన సెనెట్ ఎన్నికల్లో తన సన్నిహితుడు, ఆర్థికమంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ ఓటమి పాలయ్యారు. హఫీజ్ కోసం ఇమ్రాన్ ప్రచారం సైతం నిర్వహించారు. మంత్రిపై విపక్షాల తరఫున పోటీ చేసిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి గిలాని విజయం సాధించారు.
ఇమ్రాన్ ఖాన్ సెనెట్ విశ్వాసాన్ని కోల్పోయారని, ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు పట్టపట్టాయి. దీంతో పార్లమెంటులో బలం నిరూపించుకోవడం ద్వారా ప్రతిపక్షాలకు గట్టి జవాబు ఇవ్వాలని ప్రధాని యోచిస్తున్నారు.
ఇదీ చూడండి: చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి సిద్ధం: ఇమ్రాన్