పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి వివాదంలో చిక్కారు. 10లక్షల డాలర్ల విలువ చేసే చేతి గడియారం (Imran Khan Gift Watch) సహా ఇతర దేశాధినేతల నుంచి స్వీకరించిన ఖరీదైన కానుకలను విక్రయించి సొమ్ము చేసుకున్నారని (Imran Khan Gift Watch Scandal) ప్రతిపక్షాలు ఆరోపించాయి.
విదేశీ పర్యటనల సందర్భంగా దేశాధినేతలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న అధికారులు కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. వేలం వేయనంత వరకూ వాటిని దేశ సంపదగా భావిస్తారు. కానుకల విలువ 10వేల రూపాయలలోపు ఉంటే ఏమీ చెల్లించకుండానే అధికారులు వాటిని తీసుకోవచ్చు. (Imran Khan gifts)
దుబాయ్‌లో అమ్మి...
అయితే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. ఇతర దేశాధినేతలు ఇచ్చిన కానుకలను (Imran Khan gifts) అమ్ముకున్నారని పీఎంఎల్ నేతలు ఆరోపించారు. గల్ఫ్ దేశానికి చెందిన ఓ యువరాజు బహూకరించిన 10లక్షల డాలర్ల విలువచేసే చేతి గడియారాన్ని ప్రధాని సన్నిహితుడు దుబాయ్‌లో విక్రయించి, ఆ మొత్తాన్ని ఇమ్రాన్‌కు ఇచ్చాడని సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ విషయం గల్ఫ్ యువరాజుకు తెలిసినట్లు ఆయా కథనాలు పేర్కొన్నాయి.
ఈ అంశంపై అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగాయి. ప్రధాని ఇమ్రాన్ చర్యల వల్ల పాకిస్థాన్ పరువు పోయిందని మండిపడుతున్నాయి.
ఇదీ చదవండి: UNGA 2021: మళ్లీ పాక్ వక్ర బుద్ధి- గట్టిగా బదులిచ్చిన భారత్