ETV Bharat / international

ఆ దాడి కచ్చితంగా భారత్​ పనే: ఇమ్రాన్​ఖాన్​ - పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​

భారత్​పై పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ మరోమారు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. కరాచీ స్టాక్​ ఎక్స్చేంజ్​పై జరిగిన ఉగ్రదాడికి భారతే కారణమని ఆరోపించారు. ఇందులో తమకు ఎలాంటి సందేహం లేదన్నారు.

Pak PM blames India for Karachi attack
కరాచీ దాడికి భారత్​ కారణం: ఇమ్రాన్​ఖాన్​
author img

By

Published : Jun 30, 2020, 9:49 PM IST

Updated : Jul 1, 2020, 5:57 AM IST

కరాచీ స్టాక్​ ఎక్స్చేంజ్​పై జరిగిన దాడి వెనక భారత్ హస్తం ఉందని​ పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ ఆరోపించారు. ఈ విషయంలో తమకు ఎలాంటి సందేహం లేదని పాక్​ పార్లమెంట్​ వేదికగా వ్యాఖ్యానించారు.

"ముంబయిలో జరిగినట్టుగానే కరాచీలో కూడా చేయాలనుకున్నారు. పాక్​లో అనిశ్చితి నెలకొల్పాలని వారు(భారత్​) అనుకున్నారు. ఇది కచ్చితంగా భారత్​ చేసిన పనే. ఇందులో మాకు ఎలాంటి సందేహం లేదు. స్టాక్​ ఎక్స్చేంజ్​లోని వారిని బందీలుగా తీసుకుని.. భయం, అనిశ్చితిని నెలకొల్పేందుకు వారిని చంపాలని ఉగ్రవాదులు భావించారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఆయుధాలు తీసుకొచ్చారు. కానీ ఉగ్రవాదులను పాక్​ భద్రతా బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి."

- ఇమ్రాన్​ఖాన్​, పాకిస్థాన్​ ప్రధాని.

సోమవారం.. కరాచీలోని పాకిస్థాన్​ స్టాక్ ఎక్స్చేంజ్ పై నలుగురు ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది, ఒక ఎస్సై, స్థానిక పౌరుడు సహా మొత్తం 11మంది ప్రాణాలు కోల్పోయారు.

ఉగ్రదాడి అనంతరం.. ఘటనకు భారత్​ కారణమని పాక్​ విదేశాంగమంత్రి ఖురేషి ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను భారత్​ ఇప్పటికే ఖండించింది.

ఇదీ చూడండి:- లాడెన్​​ అమరవీరుడంటూ కీర్తించిన ప్రధాని

Last Updated : Jul 1, 2020, 5:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.