భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించేందుకు.. పాకిస్థాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లుకు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది. జాదవ్ మరణశిక్షపై సమర్ధమైన పద్ధతిలో తప్పకుండా పునఃసమీక్ష చేయాలని అంతర్జాతీయ న్యాయస్ధానం (ఐసీజే).. 2019జులైలో ఇచ్చిన తీర్పు ఆధారంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.
అంతర్జాతీయ న్యాయస్ధానం-సమీక్ష, పునరాలోచన పేరుతో పాకిస్థాన్ ప్రభుత్వం రూపొందించిన ఈ ముసాయిదా బిల్లుపై న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చర్చించి.. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఆమోదం తెలిపింది. చర్చలో పాల్గొన్న పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి ఫరోగ్ నసీమ్.. అంతర్జాతీయ న్యాయస్ధానం ఆదేశాలకు అనుగుణంగా ఈ బిల్లును రూపొందిచినట్లు తెలిపారు. పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించకుంటే పాకిస్థాన్ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి:- 'కుల్‌భూషణ్ యాదవ్ కేసులో అది సాధ్యం కాదు'