పాకిస్థాన్‌లో అమానవీయ ఘటన జరిగింది. కష్టసుఖాల్లో తోడని తనను నమ్మి కట్టుకున్న భార్యతో అతి కిరాతకంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. రోజూ పెట్టే హింసతో సంతృప్తి అనిపించలేదో ఏమో.. కోపంతో భార్య ముక్కు కోసి, గుండు కొట్టాడు. ఆ మహిళకు జరుగుతున్న దారుణాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు దుర్మార్గుడి చెరనుంచి ఆమెను విడిపించి... ఆసుపత్రికి తరలించారు.
పాకిస్థాన్ లాహోర్‌కు చెందిన సజ్జద్ అహ్మద్ తన భార్య షాజియాను రోజూ హింసిస్తుండేవాడు. కోపం వచ్చినప్పుడు పైపులతో, ఇనుప రాడ్లతో ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. చాలా సార్లు స్థానికులు మహిళను ఆ దుర్మార్గుడి నుంచి రక్షించారు. తాజాగా నెలవారీ సరుకులకు కిరాణా కొట్టు వద్ద చెల్లించాల్సిన డబ్బును ఇవ్వాలని భర్తను ఆమె కోరింది. అందుకు ఆగ్రహించిన అహ్మద్.. 'వాటిని నీ అనారోగ్యం కోసమే ఖర్చు చేశా'నంటూ కోపంతో ఊగిపోయి కత్తి తీసుకొని ఆమె ముక్కు కోశాడని షాజియా వెల్లడించింది.
కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.