పాకిస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగస్థులు తమ జీతాలను 25శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నిరసన చేపట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను 10శాతం పెంచుతామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను శుక్రవారం వారు వ్యతిరేకించారు. మూడేళ్లుగా తమ జీతాలను ప్రభుత్వం పెంచనేలేదని నిరసనకారులు మండిపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. శుక్రవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ బయట వారు ఆందోళన నిర్వహించారు.
పాక్ జాతీయ అసెంబ్లీకి వెళ్లే రహదారి మార్గాన్ని నిరసనకారులు నిర్బంధించారు. 10శాతం ఫిట్మెంట్ పెంపు నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. తమ జీతాలను 25శాతం పెంచకపోతే.. జూన్ చివరినాటికి ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశం ముగిసిన అనంతరం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఛైర్మన్ బిలాల్వాల్ భుట్టో జార్దారి నిరసనల్లో పాల్గొన్నారు. వారికి మద్దతు తెలిపారు.
ఇదీ చూడండి: బలూచిస్థాన్‌లో పాక్ సైన్యం దాడులు.. ముష్కరుల హతం
ఇదీ చూడండి: కుల్‌భూషణ్ కేసులో కీలక బిల్లుకు పాక్ ఆమోదం