ETV Bharat / international

ప్రధాన మంత్రి జీతం ఒకేసారి 4 రెట్లు పెరిగిందా? - pakistan imran

నానాటికీ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించిన పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​.. తన  జీతాన్ని మాత్రం నాలుగు రెట్లు పెంచుకున్నట్లు ఆ దేశ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ కథనాలపై దుమారం రేగిన నేపథ్యంలో... వేతనం పెరగలేదని ప్రధాని కార్యాలయం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Pak govt dismisses reports of four-fold pay hike for Imran Khan
ప్రధాన మంత్రి జీతం ఒకేసారి 4 రెట్లు పెరిగిందా?
author img

By

Published : Jan 31, 2020, 6:04 PM IST

Updated : Feb 28, 2020, 4:37 PM IST

పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో​ కూరుకుపోయింది. నిర్వహణ ఖర్చులను వీలైనంతమేరకు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్థిక వ్వవస్థను చక్కబెట్టేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి ఇప్పటికే 6 బిలియన్​ డాలర్ల రుణం తీసుకుంది. తన మిత్ర దేశాలైన చైనా, యూఏఈ సౌదీ నుంచి ప్యాకేజీని సైతం అందుకుంది.

అర్థిక వ్యవస్థ అంతంత్ర మాత్రంగానే ఉండగా.. పాక్​​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ జీతం రూ.2.01లక్షల నుంచి రూ.8లక్షల వరకు పెరిగినట్లు ఆ దేశ మీడియాలో కథనాలు రావడం చర్చనీయాంశమైంది. అనంతరం ఆ వార్తలు నిరాధారమైనవని ఇమ్రాన్​ కార్యాలయం స్పష్టం చేయగా చర్చకు తెరపడింది.

"ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని ప్రచారం చేస్తున్న సమయంలో ఇటువంటి నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడం దురదృష్టకరం"

-ప్రధాని కార్యాలయ ప్రతినిధి

ప్రధాన మంత్రి అధికారిక నివాస నిర్వహణ ఖర్చులను తగ్గించినట్లు, తన సొంతింటి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు ఇమ్రాన్​ఖాన్​. ఇంటి నిర్వహణ వ్యయాన్ని తానే భరిస్తున్నట్లు చెప్పారు. దేశ ఆర్థిక వ్వవస్థపై భారం పడనీయకుండా ఉండేందుకు ఇద్దరు వ్యాపారవేత్తలు ఇచ్చిన విరాళాలతోనే ఇటీవల స్విట్జర్లాండ్​లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లినట్లు చెప్పారు పాక్​ ప్రధాని.

Last Updated : Feb 28, 2020, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.