Hafiz Saeed: పాకిస్థాన్లోని తీవ్రవాద వ్యతిరేక కోర్టు నలుగురు వ్యక్తులకు బుధవారం మరణశిక్ష విధించింది. వీరు ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ఇంటి ఆవరణలో గతేడాది జూన్లో జరిగిన శక్తిమంతమైన కారుబాంబు పేలుడు కేసులో నిందితులు. జోహర్ పట్టణంలో జరిగిన ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. చుట్టుపక్కల పలువురి ఇళ్లు, దుకాణాలు, వాహనాలు దెబ్బతిన్నాయి.
అత్యంత భద్రత నడుమ కోట్ లఖ్పత్ జైలులో జరిగిన ఇన్-కెమేరా విచారణలో ఆయేషా బీబీ అనే మరో మహిళకు తీవ్రవాద వ్యతిరేక కోర్టు జడ్జి అర్షద్ హుసేన్ భుట్టా.. అయిదేళ్ల జైలు శిక్ష విధించారు. తీవ్రవాద సంస్థలకు ఆర్థికసాయం చేసిన కేసుల్లో సయూద్ జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు పాక్ అధికారులు చెబుతున్నా.. కారుబాంబు పేలుళ్ల సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: హఫీజ్ సయీద్ అనుచరులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు