పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని హిందూ దేవాలయం పునర్నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో నివేదించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గతేడాది డిసెంబర్లో రాడికల్ ఇస్లామిక్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు కారక్ జిల్లాలోని ఓ హిందూ దేవాలయాన్ని కూల్చి వేశారు. దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున్న ఉద్రిక్తతలు తలెత్తాయి.
దశాబ్దాల నాటి ఈ ఆలయ పునరుద్ధరణ పనులకు స్థానిక అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ గత వారం జమైత్ ఉలేమా-ఈ-ఇస్లామ్ పార్టీ నేతృత్వంలో దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీసులు 350 మందిపై కేసు నమోదు చేశారు.
ఆలయ పునర్నిర్మాణ పనులకు ఇప్పటికే అనుమతి ఇచ్చిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు.. దాడి వల్ల జరిగిన నష్టాన్ని దీనికి కారణమైన వారి నుంచి వసూలు చేయాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: 'పాక్లో గుడి కూల్చివేత'లో పోలీసు కస్టడీకి 56 మంది