ETV Bharat / international

'ఇదే చివరి అవకాశం.. ఈనెల 10లోపు హాజరవ్వాల్సిందే' - Sharif news

పాకిస్థాన్​​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​కు చివరి అవకాశమిచ్చింది ఇస్లామాబాద్​ హైకోర్టు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న షరీఫ్​ సెప్టెంబరు 10లోపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Pak court gives 'last chance' to former PM Nawaz Sharif to surrender before Sept 10
'షరీఫ్​కు ఆఖరి అవకాశం- విచారణకు హాజరుకావాలి'
author img

By

Published : Sep 2, 2020, 8:38 AM IST

అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​... సెప్టెంబరు 10వ తేదీ లోపు న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఇస్లామాబాద్​ హైకోర్టు ఆదేశించింది. నవాజ్​కు ఇదే చివరి అవకాశంగా కోర్టు తెలిపింది. ఈ మేరకు ఆ దేశ మీడియా వెల్లడించింది.

"కోర్టు ముందు హాజరుకావడానికి నవాజ్​ షరీఫ్​కు చివరి అవకాశం ఇస్తున్నాం. ఏదేమైనా ఈనెల 10లోపు​ తప్పనిసరిగా ధర్మాసనం ముందు హాజరవ్వాలి."

-న్యాయస్థానం

షరీఫ్​కు అల్-అజీజియా స్టీల్​ మిల్స్​ కేసులో ఏడేళ్లు జైలు శిక్ష విధించింది లాహోర్​ హైకోర్టు. అయితే గతేడాది నవంబరులో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న షరీఫ్‌కు వైద్య చికిత్స కోసం నాలుగు వారాలపాటు లండన్‌ వెళ్లేందుకు లాహోర్‌ హైకోర్టు అనుమతిచ్చింది. అప్పటి నుంచి నవాజ్​ అక్కడే తలదాచుకుంటున్నారు. గతేడాది డిసెంబరులోనే గడువు ముగిసినప్పటికీ తిరిగి స్వదేశానికి రాకపోవడం వల్ల షరీఫ్​ పరారీలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది పాక్​. ఈ మేరకు తమకు అప్పగించాలని బ్రిటన్​ ప్రభుత్వానికి విన్నవించింది.

ఇదీ చూడండి: రష్యాలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.