ETV Bharat / international

రఫేల్​కు పోటీగా చైనా జెట్​లు కొన్న పాక్​

Pak china fighter jet deal: భారత్​ అత్యంత శక్తిమంతమైన రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం చూసి ఓర్వలేకపోతోంది పాకిస్థాన్​. అందుకే మనకు పోటీగా చైనా నుంచి J-10C యుద్ధ విమానాలను కొంటోంది. మార్చి 23న పాకిస్థాన్​ డే వేడుకల్లో ఇవి తమకు అందుతాయని పాక్ హోంమంత్రి వెల్లడించారు.

Pak china fighter jet deal, పాక్​ చైనా న్యూస్​
రఫేల్​కు పోటీగా చైనా యుద్ధవిమానాలు కొన్న పాక్​
author img

By

Published : Dec 30, 2021, 6:20 PM IST

Pak china fighter jet deal: భారత అమ్ముల పొదిలో రఫేల్ యుద్ధ విమానాలు చేరడం చూసి తట్టుకోలేకపోతోంది పొరుగు దేశం పాకిస్థాన్​. అందుకే రఫేల్​కు పోటీగా చైనా నుంచి యుద్ధవిమానాలను దిగుమతి చేసుకుంటోంది. ఈమేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం చైనా తయారు చేసిన అత్యంత శక్తిమంతమైన J-10C యుద్ధ విమానాలను పాక్ కొనుగోలు చేస్తోంది. మొత్తం 25 ఎయిర్​క్రాఫ్ట్​లను అందుకోనుంది. పాకిస్థాన్​ దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది మార్చి 23న జరిగే వేడుకల్లో ఈ యుద్ధవిమానాలు పాక్​ సైన్యంలో చేరుతాయని ఆ దేశ హోంమంత్రి షేక్ రషీద్​ తెలిపారు. బుధవారం రావల్పిండిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

మార్చి 23న జరిగే వేడకకు తొలిసారి ముఖ్య అతిథులు హాజరవుతున్నారని రషీద్ చెప్పారు. చైనా యుద్ధవిమానాలతో పాక్ సైన్యం ఫ్లై పాస్ట్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

Pak china news

పాకిస్థాన్​కు చిరకాల మిత్ర దేశమైనా చైనా.. ఆ దేశానికి అన్ని విధాలుగా అండగా ఉంటోంది. ఇరు దేశాలు గతేడాది నిర్వహించిన ఉమ్మడి యుద్ధ విన్యాసాల్లో J-10Cని ప్రదర్శించారు. అప్పుడే పాక్ నిపుణులు దీని శక్తి సామర్థ్యాలను గమనించారు. తాజాగా వాటిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

Rafael aircraft news

రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్​తో ఐదేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది భారత్​. దీనిలో భాగంగా 36 యుద్ధ విమానాలకు దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే కొన్నింటిని అందుకుంది. భారత వాయుసేన శక్తి సామర్థ్యాలను మరింత పటిష్ఠం చేసేందుకు కుదుర్చుకున్న ఈ ఒప్పందం విలువ రూ.59వేల కోట్లు అని అంచనా.

ఇదీ చదవండి: వక్రబుద్ధి మార్చుకోని పాక్- ఓఐసీలో కశ్మీర్ ప్రస్తావన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.