ETV Bharat / international

పాక్​లో కరోనా నాలుగో వేవ్ కలకలం - మయన్మార్​లో ఆక్సిజన్​ కొరత

భారత్​ సరిహద్దు దేశాలైన పాకిస్థాన్​, మయన్మార్​లో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. పాక్​ వైరస్​ నాలుగో దశతో పోరాటం చేస్తుంటే.. మయన్మార్​ను ప్రాణవాయువు కొరత వేధిస్తోంది.

Pak braces to fight fourth wave of coronavirus
పాక్​లో నాలుగో దశ
author img

By

Published : Jul 11, 2021, 4:21 PM IST

కరోనా నాలుగో వేవ్​తో పాకిస్థాన్​ పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన మూడు వారాల్లో పాజిటివ్​ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. వ్యాపార సంస్థలు, పర్యటక ప్రదేశాలను తెరిచేందుకు అనుమతులు ఇవ్వడం వల్ల కేసుల సంఖ్య భారీగా పెరుగతోందని ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈదుల్​ అజాను కూడా పలు ఆంక్షల నడుమ జరుపుకుంటున్నారు.

శనివారం 1,980 కొత్త కేసులు వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా పెరిగిన కేసులతో దేశంలో పాజిటివిటి రేటు 4.09 శాతానికి చేరుకుంది. ఇది జూన్​ 21న నిర్ధరణ అయిన కేసుల(663)తో పోల్చితే శనివారం వచ్చిన కేసులు మూడు రెట్లుగా ఉన్నాయి. మే 30 నుంచి పాజిటివిటి రేటు నాలుగు శాతాన్ని దాటడం ఇదే తొలిసారని పాక్​ ఆరోగ్య శాఖ తెలిపింది.

మయన్మార్​లో ఆక్సిజన్​ కొరత...

సైనిక పాలనలో ఉన్న మయన్మార్​ను ఆక్సిజన్​ కొరత వేధిస్తోంది. ప్రాణవాయువును కొనుగోలు చేసేందుకు పౌరులు ఆక్సిజన్​ ప్లాంట్ల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. ప్రధాన నగరాలైన యాగోన్​, మాండలైలో ఆక్సిజన్​ అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం అవసరాలను తీర్చేందుకు పారిశ్రామిక ఆక్సిజన్​ను మార్చి వైరస్​ బాధితులకు అందుబాటులో ఉంచుతున్నారు అధికారులు.

మరోవైపు కొత్త కేసుల సంఖ్య భారీగా ఉండడం ప్రజలను కలవరపెడుతోంది. శనివారం 4,377 కొత్త కేసులు వెలుగు చూశాయి. 71 మంది చనిపోయారు.

ఇదీ చూడండి: మెక్సికోలో మూడో దశ- టోక్యోలోనూ కలకలం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.