ETV Bharat / international

పీఓకేలో చైనా బలగాలపై పాక్​​ బుకాయింపు - Pakistan-occupied Kashmir

20వేల వరకు బలగాలను పీఓకేలోని నియంత్రణ రేఖ (ఎల్​ఓసీ) వద్ద మోహరించినట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చింది పాకిస్థాన్​. అవన్నీ అవాస్తవమైన, నిరాధారమైన కథనాలని పేర్కొంది. పాక్​లో చైనా బలగాలే లేవని బుకాయించే ప్రయత్నం చేసింది.

Pak Army rejects reports of additional deployment
పీఓకేలో చైనా బలగాలపై పాకిస్థాన్​​ బుకాయింపు!
author img

By

Published : Jul 2, 2020, 5:13 PM IST

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని స్కర్దులో చైనా విమానం ఉన్నట్లు ఇటీవల వచ్చిన వార్తలు అవాస్తవమని బుకాయించే ప్రయత్నం చేసింది పాకిస్థాన్​. పీఓకేలోని నియంత్రణ రేఖ వద్ద 20 వేల మంది సైనికుల్ని మోహరించినట్లు వస్తున్న వార్తలనూ తోసిపుచ్చింది. అవన్నీ అవాస్తవమని, నిరాధారమైన కథనాలని పేర్కొంది.

పాక్​లో చైనా బలగాలు ఉన్నాయన్న వార్తలను ట్విట్టర్​ వేదికగా తీవ్రంగా ఖండించింది పాక్ సైన్యం మీడియా విభాగం. పీఓకేలోని స్కర్దు వైమానిక స్థావరాన్ని చైనా వినియోగించుకుంటుందన్న వార్తలనూ తోసిపుచ్చింది.

" గిల్గిత్​ బాల్టిస్థాన్​లోని ఎల్​ఓసీ వెంబడి అదనపు బలగాలను మోహరించటం సహా స్కర్దు ఎయిర్​బేస్​ను చైనా వినియోగించుకోవటం అనేది పూర్తిగా అవాస్తవం. అలాంటి అదనపు బలగాల మోహరింపులు జరగలేదు. పాక్​లో చైనా బలగాలు ఉన్నాయన్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం."

- మేజర్​ జనరల్​ బాబార్​ ఇప్తిఖార్​, పాక్​ సైన్యం

తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పీఓకేలోని ఎల్​ఓసీ వెంబడి పాక్​ 20వేల అదనపు బలగాలను మోహరించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తూర్పు ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా మోహరించిన బలగాలకు సమానమైన సంఖ్యగా పేర్కొన్నాయి. అది బాలాకోట్​ వైమానిక దాడుల తర్వాత పాక్​ మోహరించిన బలగాలకన్నా అధికమని వెల్లడించాయి.

ఇదీ చూడండి: పీవోకేలో చైనా విమానం- సరిహద్దులో భారీగా బలగాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.