ETV Bharat / international

పార్లమెంట్​పై దాడి కేసులో పాక్​ ప్రధానికి క్లీన్​చిట్​ - పార్లమెంట్​పై దాడి కేసు

పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​కు ఊరట లభించింది. 2014లో జరిగిన పార్లమెంట్​పై దాడి కేసులో ప్రధానిని నిర్దోషిగా తేల్చింది తీవ్రవాద వ్యతిరేక కోర్టు. విదేశాంగ మంత్రి షా మహమ్మూద్​ ఖురేషీ సహా పలువురు సీనియర్​ నేతలు నవంబర్​ 12న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

PM Khan
పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్
author img

By

Published : Oct 29, 2020, 5:46 PM IST

పార్లమెంట్​పై దాడి కేసులో పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​కు క్లీన్​చిట్​ ఇచ్చింది తీవ్రవాద వ్యతిరేక కోర్టు. 2014లో జరిగిన దాడి కేసులో ఇమ్రాన్​ను నిర్దోషిగా తేల్చింది. కానీ, విదేశాంగ మంత్రి షా మహమ్మూద్​ ఖురేషీ సహా పలువురు మంత్రులు, సీనియర్​ నేతలు నవంబర్​ 12న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది.

ఈ కేసులో విచారణ చేపట్టారు తీవ్రవాద వ్యతిరేక కోర్టు న్యాయమూర్తి రాజా జవాద్​ అబ్బాస్​ హసన్​. అధ్యక్ష హోదా కల్పిస్తున్న ప్రత్యేక రక్షణల కారణంగా.. ప్రెసిడెంట్​ అరిఫ్​ అల్విపై దర్యాప్తును నిలిపివేశారు. ఈ కేసును కొనసాగించటానికి ప్రాసిక్యూషన్​ ఆసక్తి చూపకపోవటం వల్ల తనను నిర్దోషిగా ప్రకటించాలని కొద్ది రోజుల క్రితం ఇమ్రాన్​ కోరిన తర్వాత ఈ మేరకు తీర్పు వెలువడటం గమనార్హం.

2014, ఆగస్టు 31న ప్రస్తుత అధికార పార్టీ పాకిస్థాన్​ తెహ్రీక్​ ఈ ఇసాఫ్​ (పీటీఐ), పాకిస్థాన్​ అవామి తెహ్రీక్​ (పీఏటీ) కార్యకర్తలు పార్లమెంట్​ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. పార్లమెంట్​లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ప్రధాని నివాసంలోకి వెళ్లేందుకు యత్నిస్తూ పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఇమ్రాన్​ ఖాన్​, ఇతర నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. పాక్ మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇదీ చూడండి: బాంబుదాడులతో 4 రోజుల్లో 58 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.