ETV Bharat / international

'పాక్​ జెట్​ను కూల్చింది అభినందనుడే' - పుల్వామా దాడి

పాకిస్థాన్​ వాయుసేనకు చెందిన ఎఫ్​-16 విమానాన్ని మిగ్​-21 సాయంతో అభినందన్​ వర్ధమాన్​ కూల్చారని భారత విదేశాంగ స్పష్టంచేసింది. ఇందుకు ఎలక్ట్రానిక్​ ఆధారాలు ఉన్నట్లు తేల్చిచెప్పింది.

''పాక్ కచ్చితంగా​ ఎఫ్​-16 యుద్ధవిమానాలనే వాడింది''
author img

By

Published : Mar 9, 2019, 6:34 PM IST

భారత్​పై దాడికి అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్​-16లను పాకిస్థాన్​ ఉపయోగించిందని స్పష్టం చేశారు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్​ కుమార్​. దిల్లీ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... కొనుగోలు నిబంధనలను ఈ చర్య ఉల్లఘించిందా? లేదా? అనేది పరీక్షించాలని అమెరికాను కోరినట్లు తెలిపారు. పాకిస్థాన్​ ఎఫ్​-16లను ఉపయోగించినట్లు అంగీకరించకపోవటంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

''పాక్ కచ్చితంగా​ ఎఫ్​-16 యుద్ధవిమానాలనే వాడింది''

పాకిస్థాన్​ భారత్​పై దాడికి ఎఫ్​-16లను ఉపయోగించినట్లు ప్రత్యక్ష సాక్షులతో పాటు ఎలక్ట్రానిక్​ ఆధారాలున్నాయి. ఒక ఎఫ్​-16ను వింగ్​ కమాండర్​ అభినందన్​ కూల్చివేశారు. ఎఫ్​-16 మాత్రమే సంధించగల ఆమ్రా క్షిపణి శకలాలకు సంబంధించిన సాక్ష్యాలను మీడియాకు అందించాం.
- రవీష్​కుమార్​, విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి

పుల్వామా దాడి నుంచి అంతర్జాతీయ సమాజం భారత్​ వైపే ఉందని అన్నారు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలని కూడా వివిధ దేశాలు పాకిస్థాన్​ను కోరినట్లు తెలిపారు. ఐక్యరాజ్యసమతి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని, ఇందులో జైషే మహ్మద్​​ పుల్వామా దాడికి బాధ్యులని ప్రకటించినట్లు తెలిపారు.

Barabanki (Uttar Pradesh), Mar 09 (ANI): Five members of a family were brutally attacked in Uttar Pradesh's Barabanki district on March 08. Two members were found dead and the rest three members were critically injured. The injured have been referred to Lucknow for further treatment. According to the police, the murder seems to have been fallout of a property dispute.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.