ETV Bharat / international

'ఆ హీరో ఇల్లు 200 కోట్లు- కోటిన్నరకు ఎలా ఇస్తా?' - రాజ్​ కపూర్​ ఇంటి యజమాని

ప్రముఖ బాలీవుడ్​ నటుడు రాజ్​కపూర్​ ఇంటి కొనుగోలు విషయంలో యజమానికి, ప్రభుత్వానికి మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. పాకిస్థాన్​ పెషావర్​లో ఉన్న ఇంటిని ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ రేటుకు అమ్మడం సాధ్యం కాదని యజమాని తెలిపారు. ఆ ఇంటిని కొనుగోలు చేసి మ్యూజియంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

Owner of Raj Kapoor's ancestral home in Pakistan refuses to sell building at govt rate
'దిగ్గజ నటుడు ఇంటిని అంత చవకగా అమ్మలేము'
author img

By

Published : Jan 27, 2021, 5:56 PM IST

భారతీయ చలన చిత్ర దిగ్గజ నటుడు రాజ్ కపూర్​ పూర్వీకుల ఇంటిపై వివాదం నడుస్తోంది. పాకిస్థాన్​ పెషావర్​లో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు అమ్మే ప్రసక్తే లేదని యజమాని తేల్చి చెప్పారు. సాధారణంగా ఆ ప్రాంతంలో అమ్ముడు పోయే రేటు కంటే ప్రభుత్వం చాలా తక్కువ మొత్తానికి వెల కట్టిందని ఆరోపించారు.

రాజ్​కపూర్​కు వారసత్వంగా వచ్చిన ఆస్తిని కొనుగోలు చేసి... ఆయన గౌరవార్థం మ్యూజియంగా మార్చాలని స్థానిక ప్రభుత్వం భావించింది. ఇందుకుగాను ఇంటి కొనుగోలుకు రూ. 1.5 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ఇంటి ప్రస్తుత యజమాని హాజీ అలీ సబీర్... ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇవ్వలేనని తెలిపారు. ఆ ప్రాంతంలో సగం మార్లా(272 చ.అ) స్థలమే 1.5 కోట్లకు రావడం లేదని.. సమారు ఆరు మార్లాలు ఉండే ఇల్లు అదే రేటుకు అడగడం దారుణమని పేర్కొన్నారు. మార్కెట్​ ధర ప్రకారం రూ.200 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆ దిగ్గజ నటుల భవంతుల్ని కొననున్న పాక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.