ETV Bharat / international

జనరల్‌ బోగీ కాదు.. అమెరికా విమానం ఇది! - అఫ్గాన్​ ప్రజలు దేశం వీడేందుకు చేస్తున్న ప్రయత్నాలు

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత అక్కడి ప్రజల్లో ప్రాణ భయం పట్టుకుంది. దీనితో వేలాది మంది దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకోసం ఇనుప కంచెలు, పెద్ద పెద్ద గోడలను దూకి.. కాబుల్ విమానాశ్రయంలోకి చేరుకున్నారు. అక్కడ కనిపించిన ఏ విమానంలోకైనా ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి కొన్ని దృశ్యాలు అక్కడ దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

Afghan people left the from country
దేశం విడిచి వెళ్తున్న అఫ్గాన్ ప్రజలు
author img

By

Published : Aug 17, 2021, 2:57 PM IST

Updated : Aug 17, 2021, 3:18 PM IST

America flight looking like General coach
రైళ్లలో జనరల్‌ బోగీని తలపిస్తున్న అమెరికా విమానం..

పైన ఫొటోలో కన్పిస్తున్నది ప్యాసింజర్‌ రైల్లోని జనరల్‌ బోగీ కాదు.. అఫ్గాన్‌ పౌరులతో నిండిపోయిన అమెరికా విమానం..! తాలిబన్ల రాకతో భీతిల్లుతున్న అక్కడి ప్రజలు.. బతుకు జీవుడా అంటూ దేశం విడిచి పారిపోతున్నారు. ఇందుకోసం ప్రాణాలను తెగించేందుకైనా వెనుకాడటం లేదు. కాబుల్‌ విమానాశ్రయం నుంచి వచ్చిన అమెరికా విమానంలో కన్పించిన ఈ దృశ్యం.. అఫ్గాన్‌ పౌరుల దుస్థితికి అద్దం పడుతోంది. ఏకంగా 640 మంది విమానంలో కింద కూర్చుని ప్రయాణించారు.

in Flight
విమానంలో కింద కూర్చునే ప్రయాణం

తాలిబన్ల అరాచక పాలనతో మళ్లీ చీకటి రోజులు రాబోతున్నాయన్న భయాందోళనలతో వేలాది మంది అఫ్గాన్‌ వాసులు సోమవారం దేశం విడిచి వెళ్లేందుకు కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు. రద్దీ పెరగడం వల్ల ఎయిర్‌పోర్టు గేట్లు మూసివేస్తే ప్రహరీ పైనుంచి దూకి, ఇనుప కంచెలను దాటుకుని లోపలికి ప్రవేశించారు. విమానాల్లో చోటు కోసం రన్‌వేపై పరుగులు తీశారు. లోపలికి ఎక్కేందుకు ఒకర్నొకరు తోసుకున్నారు. అలా అమెరికాకు చెందిన ఓ విమానంలో దాదాపు 640 మంది అఫ్గాన్‌ వాసులు ఎక్కి కింద కూర్చున్నారు. వారి వద్ద ఎలాంటి వస్తువులు, లగేజీ కన్పించలేదు. తాలిబన్ల నుంచి తప్పించుకునే క్రమంలో అన్నీ వదులుకుని ఇతర దేశాలకు పారిపోతున్నారు.

దీంతో ఈ విమానం రైల్లో జనరల్‌ బోగీని తలపించింది. ఈ విమానం ఫొటోలను అమెరికా అధికారిక మీడియా సంస్థ 'డిఫెన్స్‌ వన్‌' తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విమానం ఖతార్‌లో ల్యాండ్ అయ్యిందని, అక్కడే వీరంతా దిగిపోయారని డిఫెన్స్ వన్‌ తెలిపింది. ఇదే కాదు.. అమెరికాకు చెందిన ఇతర విమానాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కన్పించాయి.

Afghan people in flight
విమానం తలుపు దగ్గర కూర్చున్న అఫ్గాన్ ప్రజలు

విమానం ఎక్కేందుకు అఫ్గాన్‌ వాసులు ఆపసోపాలు పడుతున్నారు. ఒక దశలో కొందరు విమానం రెక్కలు, టైర్ల భాగం వద్ద దాక్కొని ప్రయాణించేందుకు ప్రయత్నించగా.. టేకాఫ్‌ అయిన తర్వాత కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నిన్న సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఇదీ చదవండి: భారత్‌ బహుమతి తాలిబన్ల వశం.. పార్కులనూ వదల్లేదు!

Last Updated : Aug 17, 2021, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.