ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 2 లక్షల 64 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 4,250 మంది మరణించారు. మొత్తం బాధితుల సంఖ్య మూడు కోట్ల 57 లక్షలకు చేరువైంది.
- మొత్తం కేసులు- 3,56,95,406
- మరణాలు- 10,45,892
- కొత్తగా నమోదైన కేసులు- 2,64,208
- కోలుకున్న బాధితులు- 2,68,65,091
- యాక్టివ్ కేసులు- 77,84,423
అమెరికాలో కొవిడ్ కల్లోలం సాగుతూనే ఉంది. కొత్తగా 41 వేల మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 421 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 76 లక్షలకు చేరువైంది. మృతుల సంఖ్య రెండు లక్షల 15 వేలు దాటింది.
బ్రెజిల్లో 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 398 మంది మరణించారు. రష్యాలో 10,888 కొత్త కేసులు బయటపడగా.. 117 మంది ప్రాణాలు కోల్పోయారు.
యూకేలో కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. ఒక్కరోజే 12,594 మందికి పాజిటివ్‌గా తేలింది. 19 మంది మరణించారు. అర్జెంటీనాలోనూ వైరస్ ప్రబలుతోంది. 11,242 కేసులు బయటపడగా.. మొత్తం బాధితుల సంఖ్య 8 లక్షలు దాటింది.
పాలస్తీనాలో కరోనా సెప్టెంబర్‌లోనే తీవ్ర స్థాయికి చేరిందని ఆ దేశ రాయబారి తెలిపారు. సెప్టెంబర్‌లో రోజుకు వెయ్యి కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 521కి చేరిందని చెప్పారు. మొత్తంగా పాలస్తీనాలో 52,954 కేసులు, 402 మరణాలు నమోదయ్యాయి.
పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 76,79,644 | 2,15,032 |
బ్రెజిల్ | 49,40,499 | 1,46,773 |
రష్యా | 12,25,889 | 21,475 |
కొలంబియా | 8,62,158 | 26,844 |
స్పెయిన్ | 8,52,838 | 32,225 |
అర్జెంటీనా | 8,09,728 | 21,468 |
దక్షిణాఫ్రికా | 6,82,215 | 17,016 |
మెక్సికో | 7,61,665 | 79,088 |
పెరూ | 8,29,999 | 32,834 |
యూకే | 5,15,571 | 42,369 |