ETV Bharat / international

జైలుపై వైమానిక దాడి.. 100మంది ఖైదీలు మృతి - సౌదీ దాడి

prison airstrike
జైలుపై వైమానిక దాడి
author img

By

Published : Jan 21, 2022, 6:43 PM IST

Updated : Jan 21, 2022, 7:06 PM IST

18:40 January 21

జైలుపై వైమానిక దాడి.. 100మంది ఖైదీలు మృతి

యెమెన్​లోని సాదా జైలుపై వైమానిక దాడికి పాల్పడింది సౌదీ. ఈ ఘటనలో 100మందికి పైగా ఖైదీలు మృతి చెందినట్లు యెమెన్​లోని రెడ్​ క్రాస్​ అంతర్జాతీయ కమిటీ అధికార ప్రతినిధి బషీర్​ ఓమర్​ తెలిపారు. 100 మందికిపైగా గాయపడినట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

హౌతీ తిరిగుబాటు దారుల ఆధీనంలో ఉన్న సాదీ రాష్ట్రంలోకి వెళ్లేందుకు సహాయక బృందాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు బషీర్​. పలువురు క్షతగాత్రులను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు తెలిపారు. తీరప్రాంత నగరం హొడేయిదాలో మరో వైమానిక దాడి జరిగి.. యెమెన్​లో​ మొత్తం అంతర్జాల సేవలకు అంతరాయం ఏర్పడిందని, ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జైలుపై దాడి జరిగినట్లు చెప్పారు.

Last Updated : Jan 21, 2022, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.