పాకిస్థాన్ రావల్పిండిలోని సద్దర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు. రద్దీగా ఉండే మార్కెట్లో ఈ పేలుడు సంభవించింది. పాకిస్థాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం దీనికి సమీపంలోనే ఉంది.
ఓ విద్యుత్ స్తంభానికి సమీపంలో విస్ఫోటకాలు పెట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. దర్యాప్తు బృందం రంగంలోకి దిగిందని.. ఫోరెన్సిక్ నిపుణులు కీలక ఆధారాలను సేకరించారని వెల్లడించారు.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇంకా ఏ ఉగ్రసంస్థ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.