ETV Bharat / international

చర్మంపై 21 గంటలు సజీవంగా 'ఒమిక్రాన్​'.. ప్లాస్టిక్​పై 8 రోజులకుపైనే! - ఒమిక్రాన్​ వైరస్​ సామర్థ్యం

Omicron survival on surfaces: ఒమిక్రాన్​ వేరియంట్​.. చర్మంపై 21 గంటల పాటు సజీవంగా ఉంటోందని జపాన్​కు చెందిన ఓ అధ్యయనం తేల్చింది. అదే.. ప్లాస్టిక్​ వస్తువులపై 8 రోజులకుపైనే జీవించగలుగుతోందని పేర్కొంది. ఈ కారణంగా ఇతర వేరియంట్లతో పోల్చితే వేగంగా వ్యాప్తి చెందగలుగుతోందని వెల్లడించింది.

Omicron survives
ఒమిక్రాన్
author img

By

Published : Jan 26, 2022, 3:46 PM IST

Omicron survival on surfaces: ఒమిక్రాన్​ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజుకు లక్షల మందికి అంటుకుంటోంది. ఇందుకు ప్రధాన కారణం.. పలు ఉపరితలాలపై ఎక్కువ కాలం సజీవంగా ఉండటమేనని చెబుతోంది ఓ అధ్యయనం. కరోనా వైరస్​ ఇతర రకాలతో పోల్చితే ఒమిక్రాన్​ వేరియంట్​.. మనుషుల చర్మంపై 21 గంటలకుపైగా, ప్లాస్టిక్​ వస్తువులపై 8 రోజులకుపైగా జీవించి ఉంటోందని తేల్చింది.

జపాన్​లోని క్యోటో ప్రిఫెక్చురల్​ యూనివర్సిటీ ఆఫ్​ మెడిసిన్​కు చెందిన పరిశోధకులు.. వుహాన్​లో ఉద్భవించిన సార్స్​ కోవ్​-2 వైరస్​తో ఇతర అన్ని వేరియంట్లను పోల్చి చూశారు. అవి పర్యావరణంలో సజీవంగా ఉండే సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇతర రకాల కన్నా.. ఒమిక్రాన్​ వేరియంట్​కు ఎక్కువ కాలం జీవించే సామర్థ్యం ఉందని తేల్చారు.

వూహాన్​లో బయటపడిన రకంతో పోల్చితే.. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్​ వేరియంట్లకు ప్లాస్టిక్​, చర్మంపై జీవించేందుకు రెండింతల సామర్థ్యం ఉన్నట్లు నిర్ధరించారు. ఈ అధ్యయనం బయోఆర్​షివ్​లో ఇటీవలే ప్రచురితమైంది.

"పర్యావరణంలో ఎక్కువ కాలం జీవించే సామర్థ్యమే.. వైరస్​ వ్యాప్తి ఎక్కువగా ఉండేందుకు కారణమవుతోంది. ఇతర వేరియంట్లతో పోల్చితే ఈ సామర్థ్యం ఒమిక్రాన్​కు ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే డెల్టా రకం కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోంది."

- పరిశోధన కర్త

అధ్యయనం ప్రకారం.. ప్లాస్టిక్​ ఉపరితలంపై వైరస్​ జీవించే సామర్థ్యం ఒరిజినల్​ వేరియంట్​ (56 గంటలు), ఆల్ఫా(191.3 గంటలు), బీటా(156.6 గంటలు), గామా(59.3 గంటలు), డెల్టా(114 గంటలు)గా ఉంది. అదే ఒమిక్రాన్​ వేరియంట్​ ప్లాస్టిక్​ వస్తువులపై 193.5 గంటలు సజీవంగా ఉంటోంది.

చర్మ నమూనాలపై సగటు వైరస్​ జీవనకాలం.. ఒరిజినల్​ వేరియంట్​కు 8.6 గంటలుగా ఉంది. అల్ఫా(19.6 గంటలు), బీటా(19.1 గంటలు), గామా(11 గంటలు), డెల్టా(16.8గంటలు), ఒమిక్రాన్​(21.1 గంటలు)గా సజీవంగా ఉంటున్నాయి.

అల్ఫా, బీటా మధ్య జీవనకాలంలో అంత పెద్ద తేడా లేదని, రెండూ ఒకేరకమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు తేల్చింది అధ్యయనం. అలాగే.. ఇథనాల్​ నిరోధకతలో సైతం స్వల్ప పెరుగుదల కనిపించినట్లు పేర్కొంది. ఇథనాల్​తో చర్మంపై ఉన్న అన్ని వైరస్​లు 15 సెకన్లలో పూర్తిగా నాశనమవుతున్నట్లు తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: అన్నీ ఒమిక్రాన్‌ కేసులే.. వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్

Omicron community spread: 'దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి ఒమిక్రాన్'

Omicron Spread: అలసత్వం వద్దు.. ఆందోళన వద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.