హాంగ్‌కాంగ్‌కు చెందిన త్సాంగ్ యిన్ హంగ్ అనే 45 ఏళ్ల ఉపాధ్యాయురాలు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌ను వేగంగా ఎక్కిన మహిళగా చరిత్ర సృష్టించారు. దాదాపు 8 వేల 849 మీటర్ల ఎత్తైన ఈ పర్వతాన్ని ఆమె కేవలం 25 గంటల 50 నిమిషాల్లోనే అధిరోహించారు.
అంతకుముందు నేపాల్‌కు చెందిన పున్జో ఝంగ్ము లానా పేరిట ఈ రికార్డు ఉండేది. ఆమె 39 గంటల 6 నిమిషాల్లో పర్వతాన్ని ఎక్కారు. అటు చికాగోకు చెందిన 75 ఏళ్ల ఆర్థర్ మ్యూర్ అమెరికా నుంచి పర్వతాన్ని అధిరోహించిన పెద్ద వయస్కుడిగా నిలిచారు. ఫలితంగా 67 ఏళ్ల బిల్ బర్క్ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు.
ఇదీ చూడండి: 12 ఏళ్ల తర్వాత గద్దె దిగనున్న నెతన్యాహూ!