ETV Bharat / international

శ్రీలంక ప్రధానిని కలిసిన అజిత్​ డోభాల్​ - bilateral ties between Sri Lankan and India

రెండు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక చేరుకున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్.. ఆ దేశ ప్రధాని మహీంద రాజపక్సతో పాటు రక్షణ మంత్రితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరిపినట్లు అధికారులు తెలిపారు.

NSA Doval calls on Sri Lankan PM Rajapaksa, discusses bilateral ties with defence secretary
శ్రీలంక ప్రధానిని కలిసిన అజిత్​ డోభాల్​
author img

By

Published : Nov 27, 2020, 9:45 PM IST

శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సతో పాటు ఆ దేశ రక్షణ మంత్రితో సమావేశమయ్యారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంపై ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శాంతి నెలకొల్పేందుకు ఇరుదేశాలు పరస్పరం ఏకాభిప్రాయానికి వచ్చాయని వెల్లడించారు.

'ఈ నేపథ్యంలో మోదీ తరపున శుభాకాంక్షలు తెలిపారు డోభాల్​. పరస్పర సహకారంలో పురోగతి సాధించడానికి ఇరుదేశాల నేతల మధ్య జరిగిన వర్చువల్​ ద్వైపాక్షిక సమ్మిట్​ను గుర్తుచేసుకున్నారు' అని శ్రీలంకలోని భారతీయ ఉన్నతాధికారులు ట్వీట్​ చేశారు.

ప్రధాని రాజపక్స ఆహ్వానం మేరకు శ్రీలంక చేరుకున్న డోభాల్​.. మాల్దీవులు, శ్రీలంక దేశాలతో త్రైపాక్షిక మారిటైమ్​ చర్చలు జరిపారు. మూడు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల నాలుగో సమావేశానికి శ్రీలంక ఆతిథ్యం ఇచ్చింది. ఇంతకుముందు ఈ భేటీ ఆరేళ్ల క్రితం భారత్​లో జరిగింది.

ఇదీ చూడండి: 'టీకా రాకపోతే ఆఫీసుకు వెళ్లేదెలా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.