ETV Bharat / international

జపాన్​ సముద్రంలోకి ఉత్తర కొరియా క్షిపణి! - north korea missile launch

ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా ఉత్తర కొరియా మళ్లీ క్షిపణి ప్రయోగాలు (North Korea Missile test 2021) చేపట్టింది. జలాంతర్గామి నుంచి వీటిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. (North Korea missile) ఈ ప్రయోగాలపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిద విచారం వ్యక్తం చేశారు.

north-korea-tests-possible-submarine-launched-missile
ఉత్తర కొరియా సబ్ మెరైన్ మిసైల్
author img

By

Published : Oct 19, 2021, 9:05 PM IST

ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం (North Korea missile) చేసింది. జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది.

మంగళవారం దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మాట్లాడుతూ ఉత్తరకొరియాలోని 'పోర్ట్‌ ఆఫ్‌ సిన్పో' నుంచి దీనిని ప్రయోగించినట్లు (North Korea Missile test 2021) పేర్కొన్నారు. ఈ పోర్టులో తరచూ సబ్‌మెరైన్లను నిలుపుతుంటారు. ఇక్కడి నుంచి ప్రయోగించిన క్షిపణి (North Korea missile) జపాన్‌ సముద్రంలో పడింది. ఈ నేపథ్యంలో దీనిని సబ్‌మెరైన్‌ నుంచి ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్షిపణి 60 కిలోమీటర్ల ఎత్తులో 450 కిలోమీటర్లు ప్రయాణించింది. (North Korea news)

ఈసందర్భంగా జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద మాట్లాడుతూ ఈ పరీక్షలపై విచారం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా, జపాన్‌లు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. వాస్తవానికి ఈ క్షిపణి 1900 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. (North Korea news)

పోటీగా దక్షిణ కొరియా

మరోపక్క దక్షిణ కొరియా కూడా సొంతంగా ఆయుధాలను అభివృద్ధి చేయడం, పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉ.కొరియా గుర్రుగా ఉంది. ద.కొరియా ఈ వారం అతిపెద్ద ఆయుధ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనుంది. ఇటీవలే ద.కొరియా, జపాన్‌, అమెరికా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లు సియోల్‌లో భేటీ అయి కీలక విషయాలపై చర్చించారు.

రైలు నుంచి ప్రయోగించే క్షిపణులు

సెప్టెంబరులో ఉత్తర, దక్షిణ కొరియాలు రోజుల వ్యవధిలో పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహించాయి. మూడు సరికొత్త క్షిపణులను ఉత్తర కొరియా బాహ్యప్రపంచానికి చూపింది. 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే క్రూజ్‌ క్షిపణిని తొలిసారి పరీక్షించింది. ఇది జపాన్‌లోని ఒకినావాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేసిన ఆయుధం. రైలుపై నుంచి బాలిస్టిక్‌ క్షిపణిని (North Korea missile train) ప్రయోగించింది. ఐరాస సర్వసభ్య సమావేశం ముగిసిన తరవాత అణ్వాయుధ ప్రయోగ సామర్థ్యమున్న హైపర్‌సోనిక్‌ క్షిపణిని పరీక్షించినట్లు ప్రకటించింది.

ఇదీ చదవండి: క్షిపణుల బెదిరింపులతో ఉత్తర కొరియాకు ఎదురు దెబ్బ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.