ETV Bharat / international

క్షిపణులతో మళ్లీ సవాళ్లు విసురుతున్న కిమ్​! - కిమ్​ జోంగ్ ఉన్ వార్తలు

అణుకార్యకలాపాల విషయంలో ఉత్తర కొరియా(North Korea Nuclear Weapons) మళ్లీ దూకుడు వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా.. సుదూర లక్ష్యాలను ఛేదించే ఓ క్రూయిజ్ క్షిపణిని(Long Range Cruise Missile) ఆ దేశం విజయవంతంగా ప్రయోగించింది.

North Korea missile test
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం
author img

By

Published : Sep 13, 2021, 11:00 AM IST

అణు కార్యకలాపాల విషయంలో కిమ్​ జోంగ్ ఉన్​ నేతృత్వంలోని ఉత్తర కొరియా ప్రభుత్వం(kim Jong Un Government).. ప్రపంచ దేశాలకు మళ్లీ సవాళ్లు విసురుతోంది. చాలా నెలల విరామం తర్వాత .. సుదూర లక్ష్యాలను ఛేదించే(లాంగ్​ రేంజ్​) ఓ క్రూయిజ్​ క్షిపణిని(Long Range Cruise Missile) శని, ఆదివారాల్లో ఆ దేశం విజయవంతంగా ప్రయోగించింది. అణుకార్యకలాపాల విషయంలో అమెరికాతో చర్చలకు విముఖత వ్యక్తం చేస్తున్న ఉత్తర కొరియా.. ఈ తాజా ప్రయోగం చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

'ఇది వ్యూహాత్మక ఆయుధం'

రెండేళ్ల పాటు శ్రమించి ఈ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్​ ఏజెన్సీ సోమవారం తెలిపింది. ఈ క్షిపణి.. 1,500 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని చెప్పింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫొటోలను ప్రచురించింది. ఈ క్షిపణిని తమ వ్యూహాత్మక ఆయుధంగా ఉత్తర కొరియా ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఇది తమ సైనికుల అమ్ముల పొదిలో చేరిన మరో బలమైన అస్త్రమని చెప్పారు.

North Korea missile test
ఉత్తర కొరియా లాంగ్ రేంజ్ క్రూయిజ్​ క్షిపణి ప్రయోగం
North Korea missile test
లక్ష్యం వైపు దూసుకెళ్తున్న క్షిపణి

జనవరిలో జరిగిన అధికార పార్టీ సమావేశంలో తమ అణ్వాయుధాలను రెట్టింపు చేస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్​ ఉన్​ ప్రకటించారు. తమ శాస్త్రవేత్తలు.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధాలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారని తెలిపారు. ఇందులో భాగంగానే.. ఈ తాజా ప్రయోగాన్ని ఉత్తర కొరియా చేపట్టినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. ఉత్తర కొరియా అణు కార్యకలాపాలను అమెరికా నిఘా వర్గాల సాయంతో తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.