ETV Bharat / international

వెనక్కి తగ్గని కిమ్.. మరోసారి క్షిపణి ప్రయోగాలు - ఉత్తర కొరియా క్షిపణి వార్తలు

North Korea Missile launch: ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. రెండు బాలిస్టిక్ క్షిపణులను జపాన్ సముద్రంలోకి ప్రయోగించిందని దక్షిణ కొరియా సైనికాధికారులు పేర్కొన్నారు.

North Korea fires unidentified projectile

author img

By

Published : Jan 27, 2022, 8:45 AM IST

North Korea Missile launch: ఉత్తర కొరియా మళ్లీ ఉద్రిక్తతలు రాజేసింది. మరోసారి క్షిపణి ప్రయోగాలు చేసింది. గురువారం రెండు బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైనికాధికారులు వెల్లడించారు. ఇది జనవరి నెలలో జరిగిన ఆరో ప్రయోగమని తెలిపారు.

తాజా క్షిపణులను జపాన్ సముద్రంలోకి ప్రయోగించారని సైనికాధికారులు తెలిపారు. అవి ఎంతదూరం ప్రయాణించాయనేది తెలియలేదని చెప్పారు. స్వల్పశ్రేణి క్షిపణులను ఉపయోగించినట్లు అధికారులు భావిస్తున్నారు.

North Korea Nuclear test: ఉత్తర కొరియా ఇటీవల ఆయుధ పరీక్షలను విస్తృతం చేసింది. జనవరి ప్రారంభంలో హైపర్​సోనిక్ మిసైల్ పరీక్షలు నిర్వహించింది. రైలు నుంచీ క్షిపణులను ప్రయోగించింది. అమెరికాపై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఈ ప్రయోగాలు చేపట్టిందని నిపుణులు చెబుతున్నారు.

తమ దేశాన్ని అమెరికా శత్రుస్వభావంతో చూస్తోందని, ఈ నేపథ్యంలో.. అణు పరీక్షలు ముమ్మరం చేస్తామని ఉత్తర కొరియా ఇటీవల ప్రకటించింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో జరిగిన చర్చల తర్వాత తాత్కాలికంగా నిలిపివేసిన కార్యకలాపాలన్నింటినీ పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీర్ఘశ్రేణి క్షిపణులు, అణుబాంబులను తయారు చేస్తామని ఈ మేరకు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: 90ఏళ్ల వయసున్న ఈ చేప గురించి తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.