ETV Bharat / international

దక్షిణ కొరియాపై సైనిక ప్రతీకార చర్యకు కిమ్​ 'నో'

దక్షిణ కొరియాపై తలపెట్టిన సైనిక ప్రతీకార చర్యను నిలిపివేయాలని కిమ్​ నిర్ణయించుకున్నారు. గత కొంత కాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను కొంతమేర తగ్గించేందుకే కిమ్​ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలుస్తోంది.

North Korea: Kim suspended military retaliation against South
దక్షిణ కొరియాపై సైనిక ప్రతీకార చర్యకు కిమ్​ 'నో'
author img

By

Published : Jun 24, 2020, 12:33 PM IST

దక్షిణ కొరియాపై ప్రణాళిక పరంగా జరగాల్సిన సైనిక ప్రతీకార చర్యను నిలిపివేసినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ ఆదేశించినట్టు తెలిపింది. దక్షిణ కొరియాపై కొంతకాలంగా తెస్తున్న ఒత్తిడిని కొంతమేర తగ్గించేందుకే కిమ్​ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

పొరుగు దేశంతో బంధం పూర్తిగా తెగిపోయిందని ఉత్తర కొరియా ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తమ భూభాగంలోని ఓ కొరియన్​ అనుసంధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. ద్వైపాక్షిక చర్చల్లో పురోగత సాధించకపోతే.. సైనిక చర్యలకు తెగబడతామని దక్షిణ కొరియాను హెచ్చరించింది. అప్పటి నుంచి దక్షిణ కొరియాను తీవ్ర ఒత్తడిలోకి నెట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేసింది కిమ్​ ప్రభుత్వం.

ఇదే క్రమంలో దక్షిణ కొరియాపై సైనిక చర్యలకు పాల్పడాలని ప్రణాళికలు రచించింది ఉత్తర కొరియా. అయితే ఈ దాడిని వాయిదా వేయాలని చివరి నిమిషంలో కిమ్​ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కేంద్ర మిలిటరీ కమిషన్​కు వెల్లడించారు.

ఈ పరిణామాలపై దక్షిణ కొరియా ఓ నిర్ణయానికి రావడానికే సైనిక చర్యలను కిమ్​ నిలిపివేసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పూర్తి వ్యవహారంపై స్పందించడానికి దక్షిణ కొరియా నిరాకరించింది. అయితే ఉత్తరకొరియా నివేదికలను సమీక్షిస్తున్నట్టు మాత్రం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- అక్కడ ఇంటర్నెట్​పై నిషేధం- కండోమ్​ల వాడకం నేరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.