ఉత్తర కొరియా, అమెరికా మధ్య అణునిరాయుధీకరణపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో గుర్తు తెలియని క్షిపణుల్ని కిమ్ సర్కారు పరీక్షించిందని దక్షిణ కొరియా ఆరోపించింది. ఆ దేశ సైనిక దళాల సంయుక్త కమాండర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉత్తర కొరియా తూర్పు తీరం నుంచి రెండు క్షిపణుల్ని ప్రయోగించినట్లు జపాన్ మీడియా సంస్థ ఒకటి తెలిపింది. అవి ఐరాస భద్రతా మండలి నిషేధించిన బాలిస్టిక్ క్షిపణులే అయి ఉండొచ్చని అంచనా వేసింది.