కశ్మీర్ పరిస్థితుల్లో మార్పు వచ్చేంతవరకు భారత్‌తో చర్చలు జరగవని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పునరుద్ఘాటించారు. పాక్ పర్యటనకు వచ్చిన అమెరికా కాంగ్రెస్ సెనెటర్లతో ఈ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్.
అమెరికా సెనెటర్లు క్రిస్వాన్ హోలెన్, మ్యాగీ హసన్‌లు ఆదివారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను సందర్శించారు. దీనిపై వారి పరిశీలనలను పంచుకునేందుకు సోమవారం పాక్ ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌తో చర్చల ప్రస్తావన వచ్చింది.
భారత్-పాక్ మధ్య చర్చలకు తానే అతిపెద్ద మద్దతుదారుడినని ఇమ్రాన్ అన్నారు. అయితే కశ్మీరీల పరిస్థితి మారేవరకు చర్చలు జరగవని స్పష్టం చేశారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినంత కాలం పాకిస్థాన్‌తో చర్చలు జరిగే ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పింది.
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ అనేక మార్లు తన దురుసు ప్రవర్తనను బయటపెట్టారు. అణుయుద్ధంపై భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. అయితే అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి మద్దతు కూడగట్టుకుందామనుకున్న ప్రతిసారీ పాకిస్థాన్‌కు భంగపాటే ఎదురైంది.
ఇదీ చూడండి: 'ఇమ్రాన్‌జీ... విమానం ఇచ్చి పంపితే అలా చేస్తారా?'