ETV Bharat / international

ప్రధాని అయినా మినహాయింపుల్లేవ్​!

author img

By

Published : May 16, 2020, 6:32 PM IST

కరోనా సంక్షోభం నెలకొన్న వేళ భౌతిక దూరం నిబంధనల పాటింపునకు ఎంతటి వారికైనా మినహాయింపులు లేవని న్యూజిలాండ్​లో జరిగిన ఓ ఘటన నిరూపించింది. ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఓ రెస్టారెంట్​కు వెళ్తే... అక్కడ ఖాళీ లేకపోవడం వల్ల ఆమెను లోపలికి అనుమతించలేదు. చేసేది లేక ఆ దేశ ప్రధాని వెనుదిరిగి వెళ్లిపోయారు.

No special favours: New Zealand leader turned away from cafe
ప్రధాని అయినా మినహాయింపులు లేవ్!

ఓ దేశ ప్రధానమంత్రి రెస్టారెంట్​కు వెళ్లి, అక్కడ ఖాళీ లేక తిరిగి వెళ్లిపోయిన ఘటన గురించి మీరెప్పుడైన విన్నారా? కనీసం అలా జరుగుతుందని కలగన్నారా? కానీ అదే జరిగింది.

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం లాక్​డౌన్​ నిబంధనలు అమలు చేసిన న్యూజిలాండ్​... తరువాత కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ సడలింపులు అమల్లోకి వచ్చిన రెండు రోజుల తరువాత ప్రధాని జెసిండా ఆర్డెర్న్​, ఆమె కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్​... వెల్లింగ్టన్​లోని ఆలివ్ అనే రెస్టారెంట్​కు వెళ్లారు. అయితే అక్కడ ఖాళీ లేకపోవడం వల్ల రెస్టారెంట్ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీనితో చేసేది లేక జెసిండా, ఆమె స్నేహితుడు క్లార్క్​ తిరిగివెళ్లిపోయారు.

రెస్టారెంట్ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయ ప్రతినిధిని ప్రశ్నించినప్పుడు... కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎవరైనా భౌతిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని జెసిండా కూడా అదే పని చేశారని ఆయన పేర్కొన్నారు.

మినహాయింపులు లేవు..

న్యూజిలాండ్​లో లాక్​డౌన్​ నిబంధనలకు కొన్ని సడలింపులు ఇచ్చినా.. భౌతిక దూరం నియమాలు మాత్రం కచ్చితంగా పాటించాల్సిందే. ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం ఒక మీటరు(మూడు అడుగులు) దూరం ఉండాలి. ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు తమ సీటింగ్​ను పరిమితం చేశాయి.

ట్విట్టర్​లో ముచ్చట్లు...

ఈ విషయం ట్విట్టర్​లో హాట్​టాపిక్​గా మారింది.

జోయి: ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఆలివ్ రెస్టారెంట్​లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే రెస్టారెంట్ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు.

దీనిపై గేఫోర్డ్​ స్పందించారు.

క్లార్క్ గేఫోర్డ్: జరిగిన దానికి నాదే బాధ్యత. నేను సరిగ్గా ప్రణాళిక వేసుకోలేదు. మా సీట్లను బుక్ చేసుకోలేదు. అయితే మేము వెనుదిరిగుతున్నప్పుడు.. ఖాళీ ఉందని హొటల్​ సిబ్బంది మా వెంటపడటం ఎంతో బాగుంది.

సర్వత్రా ప్రశంసలు..

కరోనా విజృంభణ తరువాత జెసిండా... చాలా వేగంగా ప్రతిస్పందించి లాక్​డౌన్ విధించారు. దానిని కఠినంగా అమలుచేసి వైరస్ వ్యాప్తిని బాగానే నియంత్రించగలిగారు. దీనితో ఆమెపై ప్రశంసలు కురిశాయి. గత ఐదురోజుల్లో అక్కడ ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 1,498 కేసులు నమోదుకాగా.. 21 మంది మరణించారు.

ఇదీ చూడండి: వేశ్యగృహాలు మూసేస్తే 72% కరోనా కేసులు తగ్గినట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.