భారత్‌తో దౌత్యపరమైన చర్చలకు ఇప్పట్లో అవకాశం లేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ చెప్పారు. ఆయన తన సొంత పట్టణం ముల్తాన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్‌తో దొడ్డిదారి చర్చలకు సైతం అనుకూల పరిస్థితులు లేవన్నారు. భారత్ సైతం ఇప్పటికీ ఇదే వైఖరితో ఉంది. ఉగ్రవాదం, చర్చలు ఒకే చోట ఉండవని పలు మార్లు దాయాది దేశానికి స్పష్టం చేసింది. ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.
ఇమ్రాన్‌తో ఆర్మీ చీఫ్ భేటీ..
పాకిస్థాన్ సైనిక అధిపతి జనరల్ జావేద్ బజ్వా గురువారం.. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో సమావేశమయ్యారు. పాక్ అంతర్గత, సరిహద్దు భద్రతా పరిస్థితుల్ని వారు చర్చించారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఏళ్లు గడుస్తున్న కొద్దీ పాక్-చైనాల మధ్య స్నేహం బలపడుతోందని పాక్ ఎయిర్‌చీఫ్ మార్షల్ ముజహిద్ అన్వర్ ఖాన్ అన్నారు. రెండు దేశాల వైమానిక దళాల ఉమ్మడి వార్షిక విన్యాసాల ముగింపులో ఆయన మాట్లాడారు.