ఆస్ట్రేలియాలో గత 5 నెలల్లో తొలిసారిగా ఆదివారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. జూన్ 9 తర్వాత... శుక్రవారం రాత్రి 8 నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు సున్నా కేసులు బయటపడ్డాయని అధికారులు వెల్లడించారు.
కరోనాతో అత్యంత దారుణంగా ప్రభావితమైన విక్టోరియాలో వరుసగా రెండో రోజు ఎలాంటి కేసులు బయటపడకపోవడం విశేషం. మొత్తం 27,595 కేసుల్లో ప్రస్తుతం విక్టోరియాలో 20,346కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 907మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆస్ట్రేలియా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఆరోగ్యమంత్రి గ్రేగ్ హంట్.
ప్రపంచవ్యాప్తంగా...
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4,65,15,053 కేసులు నమోదయ్యాయి. 12,02,128మంది ప్రాణాలు కోల్పోయారు. 3,35,69,933మంది కోలుకున్నారు.
ఇదీ చూడండి:- కరోనా వైరస్‌తో గుండెకు మరింత ముప్పు!