ETV Bharat / international

'ఎవరు అధ్యక్షుడైనా... ఇరాన్​కు తలొగ్గాల్సిందే!'

అమెరికా అధ్యక్ష పదవి ఎవరు చేపట్టినా సరే... తమ దేశ​ ప్రజలకు వారు తలొగ్గాల్సిందేనని ఇరాన్​ అధ్యక్షుడు హసన్ రౌహానీ అన్నారు. కరోనా విజృంభించిన విపత్కర పరిస్థితుల్లోనూ ట్రంప్​ తమ దేశంపై ఆంక్షలు విధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Hasan Rouhani_US
'ఎవరు అధ్యక్షుడైనా...ఇరాన్​కు తలొగ్గాల్సిందే'
author img

By

Published : Nov 6, 2020, 10:30 AM IST

అమెరికా అధ్యక్ష పోరులో ఎవరు గెలిచినా... ఇరాన్​కు వారు తలొగ్గాల్సిందేనని అన్నారు ఇరాన్​ అధ్యక్షుడు హసన్​ రౌహానీ. ఓ వాటర్​ పైప్​లైన్​ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

" నేడో..రేపో.. అమెరికా ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. కానీ, మాకు ఎవరు అధ్యక్షుడవుతారనేది ముఖ్యం కాదు. పోరులో ఎవరు నెగ్గినా వారు ఇరాన్​ ప్రజలకు తలొగ్గాల్సిందే ".

-హసన్​ రౌహాని, ఇరాన్ అధ్యక్షుడు.

ట్రంప్​పై ఆగ్రహం...

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ట్రంప్​ తమ దేశంపై కఠిన ఆంక్షలు విధించారని రౌహానీ మండిపడ్డారు. అమెరికా నేతలు ఎలాంటి నియమాలకు కట్టుబడి ఉండరని ధ్వజమెత్తారు. మానవ హక్కులు, విదేశీ వ్యవహారాల చట్టాలు, నియమనిబంధనలతో వారికి పనిలేదని విమర్శించారు.

ఇదీ చదవండి:ఆశ్చర్యం.. 'కరోనా' గ్రామాల్లో ట్రంప్​కు భారీ మద్దతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.