"మిలిటరీ రకానికి చెందిన సెమీ ఆటోమెటిక్ రైఫిళ్లను న్యూజిలాండ్‌లో నిషేధిస్తున్నాం. అన్ని రకాల అసాల్ట్ రైఫిళ్లపై నిషేధం ఉంటుంది. "జెసిండా ఆర్డెర్న్, న్యూజిలాండ్ ప్రధాని.
చట్టం రూపొందించే వరకు రైఫిళ్ల అమ్మకాలను నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు ప్రధాని స్పష్టం చేశారు.
ఈ నెల 15న జరిగిన ఉగ్రదాడిలో 50 మంది మృతిచెందారు.