ETV Bharat / international

వుహాన్​కు 4వేల మంది సైనిక వైద్య సిబ్బంది - కరోనా ఎఫెక్ట్​: వుహాన్​కు 4వేల మంది సైనిక వైద్య సిబ్బంది

అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా వైరస్​ను నియంత్రించేందుకు వుహాన్​కు 4 వేల మంది సైనిక వైద్య సిబ్బందిని పంపుతున్నట్లు తెలిపారు చైనా సైనికాధికారులు. ఇప్పటి వరకు చైనాలో వైరస్ బారినపడి​ 2912 మంది మరణించారు. ఇండోనేసియాలో తొలి కరోనా కేసు నమోదైనట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు.

New virus: Nearly 89,000 infected, over 3,000 dead
కరోనా ఎఫెక్ట్​: వుహాన్​కు 4వేల మంది సైనిక వైద్య సిబ్బంది
author img

By

Published : Mar 2, 2020, 3:07 PM IST

Updated : Mar 3, 2020, 4:08 AM IST

కరోనా వైరస్​ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా వైరస్​ను నియంత్రించేందుకు కరోనా పుట్టిన వుహాన్​కు 4 వేల మంది వైద్య సిబ్బందిని పంపుతున్నట్లు చైనా సైనికాధికారులు తెలిపారు. చైనాలో ఇప్పటి వరకు 2912మంది మరణించారు. ఇప్పటివరకు ఒక్క వుహాన్​ నగరంలోనే 2200 మంది మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి చైనా ప్రభుత్వ వర్గాలు.

ఇప్పటి వరకు హుబే ప్రాంతంలో సైనిక వైద్య సిబ్బంది 4,450 మందికి వైద్య సేవలు అందించగా.. అందులో వెయ్యి మందికి ఆరోగ్యం కుదుటపడినట్లు తెలిపారు. అంతేకాకుండా హుషెన్‌షాన్ ఆసుపత్రిలో సేవలు ప్రారంభినప్పటి నుంచి 1597 మందికి వైద్యం అందిచగా.. 611 మందిని డిశ్చార్జ్​ చేసినట్లు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 2 వేల మంది వైద్య సిబ్బందికి మహమ్మారి సోకినట్లు వెల్లడించారు.

89వేల కేసులు...

ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 89 వేల మందికి కరోనా సోకగా.. ఒక్క చైనాలోనే 80,026 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. చైనా తర్వాత వైరస్​ ఉద్ధృతి దక్షిణ కొరియాలో తీవ్రంగా ఉంది. ఆ దేశంలో 4212 మందికి వైరస్​ సోకి రెండో స్థానంలో ఉంది. ఇటలీలో 1694, ఇరాన్​లో 978, జపాన్​ 961, ఫ్రాన్స్​ 130, సింగపూర్​ 106 కేసులతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. అమెరికాలో తొలి మరణం నమోదైనట్లు ఆ దేశవర్గాలు తెలిపాయి. ఈ వైరస్​ ఎదుర్కొనేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించినట్లు స్పష్టం చేశాయి.

తొలికేసు..

ఆస్ట్రేలియాలోని టాస్మానియా ద్వీపంలో తొలి కరోనా కేసు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అదే విధంగా ఇండోనేసియాలో కూడా తొలి కేసు నమోదైంది.

ఇదీ చూడండి:బ్రెజిల్​ను ముంచెత్తిన వరదలు- ఒకరు మృతి

Last Updated : Mar 3, 2020, 4:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.