ETV Bharat / international

'మోదీజీ.. మాస్క్​ల ఎగుమతులకు అనుమతినివ్వండి' - మాస్క్​ల ఎగుమతి

మాస్క్​లు, ఇతర వైద్య పరికరాలను తమ దేశానికి ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు ఇజ్రాయిల్​ ప్రధాని బెంజిమన్​ నెతన్యాహు. ఈ మేరకు మోదీకి.. బెంజిమన్ ఫోన్​ చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.

Netanyahu requested PM Modi to allow export of masks, pharmaceuticals to Israel: report
మాస్క్​ల ఎగుమతులకు అనుమతులివ్వాలి: నెతన్యాహు
author img

By

Published : Mar 14, 2020, 11:35 AM IST

Updated : Mar 14, 2020, 3:28 PM IST

'మోదీజీ.. మాస్క్​ల ఎగుమతులకు అనుమతినివ్వండి'

ప్రపంచ దేశాలను కరోనా ​వణికిస్తోంది. వైరస్​ నియంత్రణకు మాస్క్​లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ దేశానికి మాస్క్​లు, కరోనా నియంత్రణకు వాడే వైద్య పరికరాల ఎగుమతికి అనుమతినివ్వాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు ఇజ్రాయిల్​ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు.

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో దేశ ప్రజల అవసరాల దృష్ట్యా మాస్క్​ల ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇటీవలే​ ప్రకటించారు. ఈ క్రమంలో మోదీకి.. ఇజ్రాయిల్​ ప్రధాని ఫోన్ ​ చేసినట్లు ఆ దేశ మీడియా తెలిపింది.

'కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండగా అవసరమైన పరికరాల సరఫరాను యథావిధిగా కొనసాగించాలని నా స్నేహితుడైన ప్రధాని మోదీని కోరాను.'

-బెంజిమన్ నెతన్యాహు, ఇజ్రాయెల్​ ప్రధాని

కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 35వేల మందిని నిర్బంధంలో ఉంచినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరి కోసం దాదాపు 1000 మంది డాక్టర్లు, 600 మంది నర్సులు పని చేస్తున్నట్లు వెల్లడించారు. 150 మందికి వైరస్​ సోకగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: దేశంలో కొరవడిన మేలిమి విద్య.. తక్షణ పరిష్కారం అవసరం

Last Updated : Mar 14, 2020, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.