ETV Bharat / international

నేపాల్​ అధికార పార్టీలో ముగిసిన వివాదం

author img

By

Published : Sep 12, 2020, 5:52 AM IST

అధికార పంపిణీ కోసం నేపాల్ ప్రధాని ఓలి, పుష్పకుమార్ దహాల్ 'ప్రచండ' మధ్య ఒప్పందం కుదిరినట్లు నేపాల్ కమ్యునిస్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ వ్యవహారాలపై పూర్తి అధికారాలు ప్రచండకు, ప్రభుత్వ వ్యవహారాలు ఓలికి అప్పగించినట్లు వెల్లడించాయి. భారత్​తో సరిహద్దు సమస్యపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.

Nepal's ruling Communist Party resolves differences between Oli and Prachanda
నేపాల్​ అధికార పార్టీలో ముగిసిన వివాదం

నేపాల్​లోని అధికార కమ్యునిస్టు పార్టీలో ముదిరిన అభిప్రాయబేధాలు సమసిపోయినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, పార్టీ కీలక నేత పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' మధ్య అధికార పంపిణీ విషయంలో ఒప్పందం కుదిరినట్లు సీనియర్ పార్టీ నేతలు వెల్లడించారు. నెలల తరబడి సాగిన ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడినట్లు తెలిపారు. 13 మంది సభ్యులతో కూడిన పార్టీ స్టాండింగ్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ దిశగా పురోగతి సాధించినట్లు స్పష్టం చేశారు.

పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా ప్రచండ సేవలందిస్తారని, పార్టీకి సంబంధించి పూర్తి స్థాయి అధికారాలు ఆయన చేతిలో ఉంటాయని నేపాల్ కమ్యునిస్టు పార్టీ ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ తెలిపారు. మరోవైపు ప్రభుత్వ వ్యవహారాలను ఓలి నడిపిస్తారని వెల్లడించారు. జాతీయ ప్రాధాన్యత ఉన్న విషయాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు పార్టీని సంప్రదించాలని అంగీకారానికి వచ్చినట్లు శ్రేష్ఠ వెల్లడించారు. రోజువారీ ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం పార్టీ నాయకత్వం జోక్యం చేసుకోదని తెలిపారు.

భారత్​తో సరిహద్దు సమస్యను రాజకీయ, దౌత్యపరమైన మార్గాల్లో పరిష్కరించుకునేందుకు సైతం భేటీలో నిర్ణయించినట్లు స్పష్టం చేశారు శ్రేష్ఠ.

ఇవీ చదవండి

రాజకీయ సంక్షోభం పరిష్కారం దిశగా 'ప్రచండ' చర్చలు

నేపాల్​ ప్రధానికి ఊరట- వెనక్కి తగ్గిన ప్రచండ!

నేపాల్ ప్రధానికి ఎందుకీ 'రాజీ'నామా కష్టం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.